ఈరోజు మూడో టీ20 మ్యాచ్‌లో సఫారీలతో తలపడనున్న టీమిండియా

*మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని సన్నాహాలు

Rama Rao
Published on: 4 Oct 2022 7:18 AM IST
Team India will go for a clean sweep in the series Today
X

ఈరోజు మూడో టీ20 మ్యాచ్‌లో సఫారీలతో తలపడనున్న టీమిండియా

Team India Vs South Africa: ఆస్ట్రేలియాతో తలపడి టీ20 సిరీస్‌ను చేజిక్కించుకున్న టీమిండియా, దక్షిణాఫ్రికా సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈరోజు సాయంత్రం ఇండోర్‌లో జరుగనున్న మూడో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా పోటీపడబోతోంది. ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించిన రోహిత్ సేన మూడో మ్యాచ్‌లోనూ సాధికార విజయాన్ని సొంతంచేసుకోవాలని బరిలోకి దిగుతోంది. తొలిమ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను టీమిండియా బౌలింగ్ దళం తక్కువ పరుగులకే కట్టడి చేసింది.

రెండో మ్యాచ్‌లో బౌలర్లు చేతులెత్తేశారు. మిల్లర్ విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అదృష్టవశాత్తు టీమిండియా విజయం సాధించింది. తొలిమ్యాచ్‌లో పేవలంగా ఆడిన టీమిండియా ఆటగాళ్లు, రెండో మ్యాచ్‌లో పుంజుకున్నారు. రెండో మ్యాచ్‌లో లోకేశ్ రాహుల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించారు. ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరు సాధించారు. మూడో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై పైచేయి సాధించి క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా సన్నాహాలు చేస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story