T20 World Cup Semifinals 2026: ఇంగ్లాండ్ తో టీమిండియా సెమీ ఫైనల్స్ పోరు.. హిస్టరీ రిపీట్ అవుతుందా?

T20 World Cup Semifinals 2026:  టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ లో ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడుతుంది.
x

T20 World Cup Semifinals 2026

Highlights

T20 World Cup Semifinals 2026: టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా. మార్చి 5న ఇంగ్లాండ్‌తో కీలక సెమీఫైనల్ పోరు జరగనుంది.

T20 World Cup Semi-Finals: డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా మరోసారి T20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. సూపర్ 8 రౌండ్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గెలుపుతో, టీమిండియా సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ విజయంతో 2016లో విండీస్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఇప్పుడు కప్పును నిలబెట్టుకునే దిశగా మరో అడుగు ముందుకు వేసింది.

స్వదేశంలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో భారత్ మొదటి నుండి మంచి ప్రదర్శన కనబరుస్తోంది. లీగ్ దశలో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన భారత్, సూపర్ 8 దశలో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఓటమితో కొంత ఒత్తిడికి లోనైంది. అయితే, ఆ తర్వాత వరుస విజయాలతో పుంజుకుని సెమీస్ చేరడం జట్టులోని సమష్టి కృషిని తెలియజేస్తోంది.

వరుసగా మూడోసారి భారత్-ఇంగ్లాండ్ సమరం

T20 World Cup Semi-Finals: సెమీఫైనల్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. మార్చి 5న ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో భారత్, ఇంగ్లాండ్ జట్లు వరుసగా మూడోసారి ముఖాముఖి తలపడుతున్నాయి. గతంలో 2022 - 2024 సెమీఫైనల్స్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడ్డాయి.

గత రికార్డులను పరిశీలిస్తే, 2022లో అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఆ తర్వాత 2024లో జార్జ్‌టౌన్‌లో జరిగిన సెమీఫైనల్‌లో టీమిండియా 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం సాధించి ప్రతీకారం తీర్చుకుంది. ఈసారి కూడా అదే తరహాలో విజయం సాధించి ఫైనల్‌కు చేరాలని సూర్య సేన పట్టుదలగా ఉంది.

గెలిచిన జట్టే ఛాంపియన్?

T20 World Cup Semi-Finals: ఈ సెమీఫైనల్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. గణాంకాల ప్రకారం చూస్తే, గత రెండు ప్రపంచ కప్‌లలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన సెమీఫైనల్‌లో ఏ జట్టు గెలిస్తే, అదే జట్టు ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. 2022లో భారత్‌పై గెలిచిన ఇంగ్లాండ్ ఛాంపియన్‌గా నిలవగా, 2024లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన భారత్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించింది.

ప్రస్తుతం ఈ ప్రపంచ టోర్నమెంట్‌లో కూడా ఇదే సెంటిమెంట్ కొనసాగుతుందా లేదా అనేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉండటంతో, హోమ్ గ్రౌండ్‌లో ప్రేక్షకుల మద్దతు కూడా టీమిండియాకు అదనపు బలాన్ని ఇవ్వనుంది. టీ20 క్రికెట్ అభిమానులు మార్చి 5న జరగబోయే ఈ భారీ పోరు కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇంగ్లాండ్ తో టీమిండియా వరల్డ్ కప్ లో ఇప్పటివరకూ..




Show Full Article
Print Article
Next Story
More Stories