వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విక్టరీ

IND vs WI: 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై భారత్‌ గెలుపు.

Sriveni Erugu
Published on: 17 Feb 2022 7:28 AM IST
Team India Team India Victory in The First T20 Against The West Indies
X

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా విక్టరీ

IND vs WI: టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా విక్టరీ కొట్టింది. కోల్కతా ఈడెన్ గార్డెన్ లో జరిగిన టీ20 క్రికెట్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌కి ఓటమి రుచి చూపించింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. ప్రారంభ ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో ఓపెనర్ ను పెవీలిన్ పంపించాడు. విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. కెప్టన్ రోహిత్ శర్మ 40 పరుగులు, ఇషాంత్ కిషన్ 35 పరుగులతో రాణించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు వన్డే తర్వాత టీ20 సిరీస్‌లో శుభారంభం చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది భారత్‌. రెండో వన్డే ఫిబ్రవరి 18న ఇదే మైదానంలో జరగనుంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story