ఏదోవిధంగా ఐపీఎల్ నిర్వహిస్తారనుకున్నా

ఏదోవిధంగా ఐపీఎల్ నిర్వహిస్తారనుకున్నా
x
Anil Kumble (File Photo)
Highlights

కరోనా వైరస్‌ ప్రభావంతో అన్ని రంగాలు కుదెలయ్యాయి.

కరోనా వైరస్‌ ప్రభావంతో అన్ని రంగాలు కుదెలయ్యాయి. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఈ ఏడాది మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 13వ సీజన్‌ తొలుత ఏప్రిల్‌ 15కు వాయిదా పడింది. అప్పటికి మహమ్మారి తీవ్రత పెరిగిపోవడంతో టోర్నీని బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది.

అయితే ఐపీఎల్‌ 13వ సీజన్‌ వాయిదాపై కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ జట్టు కోచ్, టీమిండియా మాజీ సారథి అనిల్‌ కుంబ్లే స్పందించారు.ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహణ సాధ్యమవుతుందని భవిస్తున్నట్లు చెప్పారు. కరోనా వైరస్‌ ప్రభావం నేపథ్యంలో.. ప్రేక్షకులు లేకుండా మూడు, నాలుగు స్టేడియాల్లోనైనా.. టోర్నీ జరుగుతుందని ఆశిస్తున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కాగా.. టీ20 వరల్డ్ కప్‌ వాయిదా పడి.. అక్టోబర్‌ - నవంబర్‌లో ఐపీఎల్‌ జరుగుతుందని ప్రచారం జరుగుతోందని విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన కుంబ్లే "ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణ సాధ్యమవుతుందని మేం ఇంకా ఆశావాదంతో ఉన్నాం. షెడ్యూల్‌లో సర్దుబాట్లు చేస్తే ఐపీఎల్‌కు తప్పకుండా అవకాశం ఉంటుంది. ప్రేక్షకులు లేకుండా.. మూడు, నాలుగు స్టేడియాల్లోనైనా టోర్నీ జరుగుతుందని అనుకుంటున్నాం" అని కుంబ్లే చెప్పాడు. కాగా ఎక్కువ స్టేడియాలు ఉన్న నగరాల్లోనే ఐపీఎల్‌ నిర్వహిస్తే.. ఆటగాళ్ల ప్రయాణాలను తగ్గించే అవకాశం ఉంటుందని బ్యాటింగ్‌ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ, ఫ్రాంచైజీలు ఈ అంశాన్ని పరిశీలిస్తాయని తాను అనుకుంటున్నానని చెప్పాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ జరుగుతుందని తాను భవిస్తునట్లు లక్ష్మణ్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories