India Vs Australia : ఐదుగురు టీమిండియా ఆటగాళ్లకు కరోనా నెగెటివ్‌

India Vs Australia : ఐదుగురు టీమిండియా ఆటగాళ్లకు కరోనా నెగెటివ్‌
x
Highlights

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు బయోబబుల్ రూల్స్ బ్రేక్ చేశారని ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచారు.

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టులోని ఐదుగురు ఆటగాళ్లు బయోబబుల్ రూల్స్ బ్రేక్ చేశారని.. ముందస్తు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, నవదీప్ సైనీలను టీమ్ మేనేజ్‌మెంట్ ఐసోలేషన్‌లో ఉంచింది. భారత జట్టులోని ఐదుగురు ఆటగాళ్లతోపాటు జట్టు సహాయ సిబ్బందికి కూడా పరీక్షలు నిర్వహించామని వారికి కూడా నెగెటివ్‌గా తేలినట్లు తెలిపింది. ఈ ఐదుగురు ఆటగాళ్లు న్యూ ఇయర్ సందర్భంగా మెల్‌బోర్న్ నగరంలోని ఓ ఇండోర్ రెస్టారెంటులో డిన్నర్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది కూడా .. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వీరిని జట్టులోని ఇతర సభ్యులకు ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ నేపథ్యంలో భారత జట్టు సభ్యులందరికీ ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆర్‌టీపీసీఆర్‌( RTPCR) పరీక్షల ఫలితాలు వచ్చినట్లు.. అందులో ఆటగాళ్లందరికీ నెగెటివ్‌గా నిర్ధరణ అయినట్లు బీసీసీఐ వెల్లడించింది.

అంతకుముందు నూతన సంవత్సరం సందర్భంగా ళ్లు బయోబబుల్ రూల్స్ బ్రేక్ చేస్తూ.. ఐదుగురు ఆటగాళ్లు రెస్టారెంట్‌ వెళ‌్లారు. ప్లేయర్లు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న అభిమాని.. వాళ్లకు తెలియకుండా వారి బిల్ పే చేశాడు. ఆ తర్వాత వీళ్లు డబ్బులు తిరిగి ఇద్దామని ప్రయత్నిస్తే.. ఆ ఫ్యాన్ ఒప్పుకోలేదు. ఐతే పంత్ మాత్రం అతన్ని హగ్ చేసుకున్నాడని... ఇది బయో బబుల్ రూల్స్ క్రాస్ చేయడమే అని.. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. దీనికి సంబంధించి బీసీసీఐకి కూడా సమాచారం అందించామని వివరించింది.

ప్రయాణాల్లోనూ, ప్రాక్టీస్ టైమ్‌లోనూ ఈ ఐదుగురు రెండు జట్లకు దూరంగా ఉంటారు. ఇప్పుడు ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా, బీసీసీఐ విచారణకు సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. నిజంగా అభిమానిని పంత్ హత్తుకున్నాడని తేలితే కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. ఐతే ఆ ఫ్యాన్ మాత్రం అలాంటిదేమీ జరగలేదని.. తానే ఎమోషనల్ అయి అలా చెప్పాలనని అంటున్నాడు. ఇక అటు రెస్టారెంట్ ముందు మాస్కులు ధరించలేదని... బయో బబుల్ రూల్స్ బ్రేక్ చేశారని ఆస్ట్రేలియా మీడియాలో వస్తున్న కథనాలను బీసీసీఐ ఖండించింది. నిబంధనల ప్రకారం అనుమతించిన రెస్టారెంట్‌కే వాళ్లు వెళ్లారని..బయోబబుల్‌లోనే ఉన్నారని చెప్తోంది.

టీమిండియా ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన మూడో టెస్టుకు ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకునంటున్నాయి. ఆఖరి టెస్టు కోసం క్వీన్స్‌లాండ్‌ రాష్ట్రంలోని బ్రిస్బేన్‌కు వెళ్లాల్సి ఉంది. కానీ క్వీన్స్‌లాండ్‌లో కోవిడ్ వ్యాప్తి పెరగకుండా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రంతో సరిహద్దులను క్వీన్స్‌లాండ్‌ ఇప్పటికే మూసేసింది. కానీ, క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) విజ్ఞప్తి మేరకు రెండు జట్లకు ప్రత్యేక అనుమతినిచ్చింది. కానీ అక్కడికి వెళ్లాక ఆటగాళ్లు మరోసారి క్వారంటైన్‌ తరహా కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో హోటల్‌ నుంచి గ్రౌండ్ మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అందుకే టీమిండియా ఆఖరి టెస్టును బ్రిస్బేన్‌లో కాకుండా సిడ్నీలోనే నిర్వహించాలని కోరుకుంటోంది. జట్టుతో పాటే ఐదుగురు ఆటగాళ్లు ఒకే విమానంలో సిడ్నీకి వెళ్లినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ నెల 7 నుంచి సిడ్నీ వేదికగా ఆస్ర్టేలియా, భారత్‌ జట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories