క్రికెట్ కెరీర్ పై ధోనికి కౌంట‌ర్.. దాదానే బెస్ట్.. యువరాజ్ కీలక వ్యాఖ్యలు

క్రికెట్ కెరీర్ పై ధోనికి కౌంట‌ర్.. దాదానే బెస్ట్.. యువరాజ్ కీలక వ్యాఖ్యలు
x
Yuvraj Singh (File Photo)
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనిపై యువ‌రాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ గ‌తంలో విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే.

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనిపై యువ‌రాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ గ‌తంలో విమ‌ర్శ‌లు గుప్పించిన సంగ‌తి తెలిసిందే. త‌న త‌న‌యుడు కెరీర్ ధోని దెబ్బ‌తీస్తున్నాడ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాకుండా 2019 వ‌రల్డ్ క‌ప్ లో ధోని ఆట‌తీరు కార‌ణంగానే సెమీఫైన‌ల్లో కివీస్ పై ఓడిపోయాం అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా యూవీ కూడా ధోనిపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు మాజీ ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్. క్రికెట్‌ కెరీర్‌లో టీమిండియా కెప్టెన్ల‌లో ధోని కంటే సౌరవ్‌ గంగూలీనే బెట‌ర్ అని పేర్కొన్నారు. త‌న కెరీర్ లో గంగూలీ అందరి కంటే ఎక్కువగా.. మద్దతు ఇచ్చాడని యువరాజ్‌ సింగ్‌ అన్నాడు. ధోనీ, విరాట్‌ కోహ్లీతో పోలిస్తే గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలోనే తన క్రికెట్ కెరీర్‌ ఉత్తమంగా సాగిందని తెలిపాడు.

సౌరవ్‌ గంగూలీ నేతృత్వంలోని జ‌ట్టుకు ప్రాతిధ్యం వ‌హించిన‌ప్పుడు దాదా నుంచి మంచి మద్దుతు లభించిందని యువ‌రాజ్ పేర్కొన్నారు. ఆ తర్వాత ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ధోని, దాదా ఇద్దరిలో ఎవరు బెస్ట్ అని చెప్పడం కాస్త కష్టం. అయితే గంగూలీ కెప్టెన్ గా ఉన్న స‌మ‌యంలోఔ కెరీర్‌లో మధురానుభూతులు ఉన్నాయి. అతడు ఎంతో అండగా నిలిచాడు. త‌ర్వాత కెప్ట‌న్సీ స్వీక‌రించిన‌ ధోనీ, కోహ్లీ నుంచి అలాంటి మద్దతు లభించలేదు'' అని యవీ వెల్లడించాడు. ధోనిని కాద‌ని గంగూలీపై యువీ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించ‌డంతో యువ‌రాజ్ తండ్రి వ్యాఖ్య‌ల‌కు బ‌లాన్ని చేకూరస్తున్నాయి.

ఆసీస్‌ పేసర్‌ మెక్‌గ్రాత్ , శ్రీలంక స్పిన్నర్‌ ముత్తయ మురళీధరన్ బౌలింగ్‌లో ఎక్కువగా ఇబ్బంది పడ్డానని యువీ వెల్లడించాడు. అయితే సచిన్‌ తెందుల్కర్‌ సలహాతో ముర‌ళి ధ‌ర‌న్ బౌలింగ్ లో స్వీప్‌ షాట్లు ఆడటంతో పెద్దగా రాలేదని అన్నాడు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంద‌రినో బలితీసుకోవడం హృదయవిదారకంగా ఉందని యువ‌రాజ్ వెల్లడించాడు. ''ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా చాలా వేగంగా విస్తరిస్తోంది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం హృదయవిదారకంగా ఉంది. ప్రజలు ఆరోగ్య సంస్థ వెబ్‌సైట్‌లో మహమ్మారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి త‌గిన సూచ‌న‌లు పాఠించాల‌ని'' అని పేర్కొన్నాడు.

2007 టీ20, 2011 వన్డే ప్రపంచకప్‌లను టీమిండియా సాధించడంలో యువ‌రాజ్ సింగ్ కీలకపాత్ర పోషించాడు. క్యాన్స‌ర్ కార‌ణంగా యువీ బాధ‌ప‌డుతూనే దేశానికి ప్ర‌పంచ‌క‌ప్ అందించ‌డంతో యువ‌రాజ్ ముఖ్య భూమిక పోషించాడు. 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20ల్లో భార‌త జ‌ట్టుకు యువ‌రాజ్ ప్రాతినిథ్యం వ‌హించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories