Suryakumar Yadav : టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు ఆపరేషన్.. మళ్లీ ఫిట్‌గా వస్తాడా?

Suryakumar Yadav
x

Suryakumar Yadav : టీమిండియా స్టార్ సూర్యకుమార్ యాదవ్‌కు ఆపరేషన్.. మళ్లీ ఫిట్‌గా వస్తాడా?

Highlights

Suryakumar Yadav: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాడు.

Suryakumar Yadav: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నాడు. సర్జరీ విజయవంతంగా జరిగిందని అతనే స్వయంగా ప్రకటించాడు. సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత టెస్ట్ జట్టులో తను ఆడడం లేదు. సూర్యకుమార్ యాదవ్‌కు జర్మనీలోని మ్యూనిచ్‌లో విజయవంతంగా ఆపరేషన్ జరిగింది. అతనికి స్పోర్ట్స్ హెర్నియా అనే సమస్య ఉంది. సూర్యకుమార్ యాదవ్ తన ఆపరేషన్ గురించి అప్‌డేట్ ఇస్తూ, ఆసుపత్రి బెడ్ నుంచి తన ఫోటోను పంచుకున్నాడు. తన స్పోర్ట్స్ హెర్నియాకు ఆపరేషన్ జరిగిందని, అది విజయవంతమైందని తెలిపాడు. "ఇప్పుడు నేను కోలుకుంటున్నాను. మళ్లీ మైదానంలోకి తిరిగి రావడానికి ఎదురు చూస్తున్నాను" అని సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు.



సూర్యకుమార్ యాదవ్‌ ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్ ఆడడం లేదు కానీ తన చివరి మ్యాచ్ మాత్రం ఇంగ్లాండుతోనే ఆడాడు. తను ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఫిబ్రవరి 2, 2025న ఇంగ్లాండ్‌తో టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఇది ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. సూర్యకుమార్ యాదవ్ ఆ తర్వాత ఐపీఎల్ ఆడాడు, కానీ అంతర్జాతీయ క్రికెట్ పిచ్‌పై అదే అతని చివరి మ్యాచ్.

సూర్యకుమార్ యాదవ్‌కు సర్జరీ జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతనికి గాయాల వల్ల కొన్ని ఆపరేషన్లు విజయవంతంగా జరిగాయి. ప్రతిసారీ, అతను బలంగా మైదానంలోకి తిరిగి వచ్చాడు. ఈసారి కూడా సూర్యకుమార్ యాదవ్ పూర్తి ఉత్సాహంతో మైదానంలోకి తిరిగి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ భారత టీ20 జట్టులో ఒక కీలకమైన ప్లేయర్. అతను వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్‌లో ముఖ్యమైన పాత్ర పోషించగలడు. కాబట్టి, అతను ఫిట్‌గా, మంచి ఫామ్‌లో ఉండటం చాలా అవసరం. ఈ స్టార్ ప్లేయర్ త్వరగా కోలుకుని తిరిగి ఆటలో కొనసాగాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories