అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన రైనా!

అఫ్రిది వ్యాఖ్యలకు కౌంటర్ వేసిన రైనా!
x
Suresh Raina (file Photo)
Highlights

ఒక పక్కా కరోనా వైరస్ తో ప్రపంచం అంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే పాకిస్థాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది.

ఒక పక్కా కరోనా వైరస్ తో ప్రపంచం అంతా ఉక్కిరిబిక్కిరి అవుతుంటే పాకిస్థాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. తాజాగా పాక్ మాజీ ఆటగాడు షహీద్ అఫ్రిది భారత ప్రధాని మోడీపై అనుచిత వాఖ్యలు చేశాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇటివల పర్యటించిన అఫ్రిది అక్కడ భారత్‌పై తనకున్న విద్వేషాన్ని చాటుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనితో భారత క్రికెటర్స్ అతనిపై ఫైర్ అవుతున్నారు.

ఇప్పటికే గౌతమ్‌ గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లు ఆఫ్రిది వాఖ్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన మాజీ ఆటగాడు, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ దీనిపైన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. " పాకిస్థాన్‌కు 7 లక్షల సైన్యం, 20 కోట్ల జనాభా ఉందని అఫ్రిది 16 ఏళ్ల పిల్లాడిలా మాట్లాడుతున్నాడు. అలాంటి దేశం గత 70 ఏళ్లుగా కశ్మీర్‌ కోసం బిచ్చమెత్తుకుంటోంది. అఫ్రిది, ఇమ్రాన్ ఖాన్, బాజ్వా లాంటి జోకర్లు భారత్‌కు, మోదీకి వ్యతిరేకంగా విషం చిమ్ముతూ పాక్ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. కానీ జడ్జ్‌మెంట్ డే వరకూ కశ్మీర్ పాక్‌కు దక్కదు. బంగ్లాదేశ్ గుర్తుంది కదా? " అంటూ గంభీర్ ఫైర్ అయ్యాడు.

తాజాగా సురేష్ రైనా కూడా గట్టి కౌంటర్ ఇచ్చాడు. 'ఆఫ్రిది కశ్మీర్‌ గురించి పట్టించుకోవడం మానేసి.. మీ విఫల పాకిస్తాన్‌ దేశం కోసం ఏదైనా మంచి చేయొచ్చు కదా.? కశ్మీర్‌ భారత్‌లో భాగంగా ఉన్నందుకు గర్వపడుతున్నా. కశ్మీర్‌ ఎప్పటికీ భారత్‌లో భూభాగమే' అంటూ రైనా తన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories