హిట్‌మ్యాన్ పర్ఫెక్ట్ షాట్.. గర్వపడుతున్నాం బ్రో.. రోహిత్ శర్మ పై నెటిజన్ ప్రశంసలు

హిట్‌మ్యాన్ పర్ఫెక్ట్ షాట్.. గర్వపడుతున్నాం బ్రో.. రోహిత్ శర్మ పై నెటిజన్ ప్రశంసలు
x
Rohit Sharma (File Photo)
Highlights

కరోనా వైరస్ ప్రపంచాన్ని వ‌ణికిస్తోంది. విప‌త్క‌ర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్ర‌ముఖులు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అండ‌గా ఉంటున్నారు.

కరోనా వైరస్ ప్రపంచాన్ని వ‌ణికిస్తోంది. విప‌త్క‌ర పరిస్థితులు ఎదుర్కొనేందుకు ప్ర‌ముఖులు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు అండ‌గా ఉంటున్నారు. కోట్ల ఆదాయం సంపాదిస్తున్న‌ ఈ స్టార్ క్రికెటర్లంతా ఎక్కడా? సోషల్ మీడియా వేదికగా మాటలే తప్పా ఒక్క రూపాయి ఇవ్వరు ఏంటి అని అభిమానుల నుంచి విమ‌ర్శ‌లు ఎదురైయ్యాయి. కానీ, ఆ అభిమానులే ఆటగాళ్లకు జేజేలు పలుకుతున్నారు. కరోనా మహమ్మారితో దేశం మొత్తం లాక్‌డౌన్‌లోకి వెళ్లగా.. తిండిలేక అల్లాడుతున్న అభాగ్యులకు ఆదుకునేందుకు క్రీడాలోకం ముందుకొచ్చింది.

బీసీసీఐ అధ్య‌క్షుడు సౌరవ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ , సురేశ్ రైనా తలో రూ.50 లక్షల విరాళం ప్రకటించగా.. తాజాగా రోహిత్ 80 లక్షల రూపాయ‌ల సాయం ప్ర‌క‌టించారు. టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీ, అతని సతీమణి సినీన‌టి అనుష్క శర్మ 3 కోట్ల రూపాయ‌ల‌ సాయం చేశారు. అయితే అందరూ ముందే ప్రకటించగా.. కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ కాస్త ఆలస్యంగా స్పందించారు. దీంతో వారిపై తీవ్ర విమర్శలొచ్చాయి.

ఈ నేపథ్యంలో విరాట్ అనుష్క‌ జోడీ సోమవారం పీఎం కేర్స్, మహారాష్ట్ర సీఎం స‌హాయనిధికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం రోహిత్ శ‌ర్మ‌ రూ.80 లక్షల విరాళాన్ని ప్రకటించాడు. పీఎం కేర్స్ ఫండ్‌కు 45 లక్షల రూపాయ‌లు.. మహారాష్ట్ర ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి 25 లక్షల రూపాయ‌లు ఫీడింగ్ ఇండియా, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థలకు చెరో 5లక్షలు రూపాయ‌లు అందించినట్టు రోహిత్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. పేదల భోజనానికి, వీధి కుక్కుల సంరక్షణ కోసం జొమాటో ఫీడింగ్ సంస్థ ద్వారా ఐదు ల‌క్ష‌లు రూపాయ‌లు రోహిత్ ఈ విరాళమిచ్చాడు. దీంతో జంతువుల‌పై త‌న కున్న మ‌మ‌కారం చాటుకున్నాడు. దేశం మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవాలని,మనందరిపై బాధ్య‌త‌ ఉందని రోహిత్ శర్మ గుర్తు చేశాడు.

అయితే హిట్ మ్యాన్‌ సాయంపై అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ట్విటర్ వేదికగా రోహిత్ శ‌ర్మ‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. శెభాష్.. రోహిత్ అని ఒకరంటే.. కరోనాపై హిట్‌మ్యాన్ పర్ఫెక్ట్ షాట్ అని మరొ అభిమాని కామెంట్ చేస్తున్నారు. 'రోహిత్ భయ్యా నీ మనస్సు గొప్పది.. త్వరలోనే మరో 20 లక్షలు ఇచ్చి కోటీ భర్తీ చేస్తావ్'ఓ అభిమాని ట్వీట్ చేశాడు. బంగారమన్నా.. నువ్వు అంటూ తెలుగు అభిమానులు కామెంట్ చేస్తున్నారు. జంతువులను ఆదుకోవాలనే నీ మ‌న‌స్సు గొప్ప‌ది అని మరొకరు కామెంట్ చేశారు. వైరస్ కట్టడి కోసం టీమిండియా మహిళా క్రికెటర్లు కూడా ముందుకు వస్తున్నారు. 16 ఏళ్ల రిచాఘోష్ లక్ష రూపాయ‌లు విరాళం ఇవ్వ‌గా.. మిథాలీ రాజ్ రూ. 10 లక్షలు.. స్పిన్నర్ పూనమ్ యాదవ్ రూ. 2 లక్షలు, దీప్తి శర్మ 1.5 లక్షలు రూపాయ‌లు ఇచ్చారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories