Harshit Rana: లీడ్స్ ఓటమి యువ క్రికెటర్ ను ఇంటికి పంపేసిన టీం ఇండియా

Harshit Rana
x

Harshit Rana: లీడ్స్ ఓటమి యువ క్రికెటర్ ను ఇంటికి పంపేసిన టీం ఇండియా

Highlights

Harshit Rana: భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్‌తో జరిగిన లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో భారీ ఓటమి ఎదురైంది. ఐదు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌ను కోల్పోయింది టీమిండియా.

Harshit Rana: భారత క్రికెట్ జట్టుకు ఇంగ్లాండ్‌తో జరిగిన లీడ్స్ టెస్ట్ మ్యాచ్‌లో భారీ ఓటమి ఎదురైంది. ఐదు వికెట్ల తేడాతో ఈ మ్యాచ్‌ను కోల్పోయింది టీమిండియా. ఇప్పుడు టీమ్ కన్ను బర్మింగ్‌హామ్‌లో జరగనున్న రెండో టెస్ట్‌పై ఉంది. అక్కడ ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోంది. ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ జూలై 2 నుండి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతుంది. ఈ కీలక మ్యాచ్ కోసం భారత జట్టు బుధవారమే లీడ్స్ నుండి బర్మింగ్‌హామ్‌కు బయలుదేరింది. అయితే, ఈసారి ఒక యువ ఆటగాడు టీమ్‌తో పాటు వెళ్లలేదు. ఆ ఆటగాడిని టీమిండియా స్క్వాడ్ నుండి రిలీజ్ చేశారు.

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులోని యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాను టీమ్ నుండి పంపించేశారు. రెండో టెస్ట్ మ్యాచ్ జరగనున్న బర్మింగ్‌హామ్‌కు హర్షిత్ టీమ్‌తో పాటు వెళ్ళలేదు. వాస్తవానికి హర్షిత్ రాణా మొదట్లో భారత జట్టు స్క్వాడ్‌లో లేడు. అతను ఇండియా 'ఎ' జట్టుతో కలిసి ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళాడు. కానీ సీనియర్ టీమ్ సిరీస్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు అతన్ని స్క్వాడ్‌లోకి తీసుకున్నారు.

అప్పట్లో బీసీసీఐ (BCCI) ఒక అప్‌డేట్ ఇచ్చింది. ఇంగ్లాండ్‌తో లీడ్స్ టెస్ట్ కోసం హర్షిత్ రాణాను భారత జట్టులో చేర్చినట్లు ప్రకటించింది. అంటే, హర్షిత్‌కు కేవలం ఒక మ్యాచ్‌కే టీమిండియాలో చోటు దక్కింది. అయితే, అతనికి లీడ్స్ టెస్ట్‌లో ఆడే అవకాశం రాలేదు. ఇప్పుడు అతను టీమ్ నుండి రిలీజ్ చేశారు. హర్షిత్‌ను రిలీజ్ చేయడంపై బీసీసీఐ నుండి ఇప్పటివరకు అధికారిక ప్రకటన ఏమీ రాలేదు.

హర్షిత్ రాణా భారత జట్టు తరఫున ఇప్పటివరకు 2 టెస్ట్ మ్యాచ్‌లు, 5 వన్డేలు, 1 టీ20 మ్యాచ్ ఆడాడు. ఆరు నెలల్లోనే మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) డెబ్యూ చేసే అవకాశం దక్కించుకోవడం అతని కెరీర్‌లో ఒక ప్రత్యేకత. అతను గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాలో ఉన్నాడు. ఆ పర్యటనలోనే అతను తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో అతను ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన మొదటి అనధికారిక టెస్ట్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో 99 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ మాత్రమే తీశాడు. దీని తర్వాత, అతన్ని సీనియర్ టీమ్‌తో ఇంగ్లాండ్‌లోనే ఉంచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories