ధోనీతో పోలికా.. అభిమానులు అంగీకరించరు

ధోనీతో పోలికా.. అభిమానులు అంగీకరించరు
x
KL Rahul (File Photo)
Highlights

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువుకాదని వర్ధమాన ఆటగాడు కేఎల్ రాహుల్ అన్నాడు.

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువుకాదని వర్ధమాన ఆటగాడు కేఎల్ రాహుల్ అన్నాడు. గత కొంత కాలంగా టీమిండియా వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు అవకాశమిచ్చారు. అయితే వరుస ఫార్మాట్లలో రిషబ్ పంత్ విఫలమవగా.. కేఎల్ రాహుల్ మాత్రం రాణిస్తూ జట్టులో స్థానం పదిలం చేసుకున్నారు. దీంతో వికెట్ కీపర్ ధోనీ స్థానాన్ని రాహుల్ చక్కగా భర్తీ చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆస్ట్రేలియా వేదికగా జరిగే అక్టోబరులో టీ20 వరల్డ్‌కప్ జరగనుండగా.. ఈ టోర్నీకి ధోనీకి బదులుగా రాహుల్‌ని కీపర్‌గా ఎంపిక చేయాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ధోనీతో పోలికపై కేఎల్ రాహుల్ స్పందించారు. ఐపీఎల్‌లోనే, దేశవాళి క్రికెట్‌లో కర్ణాటక తరఫున కీపింగ్ చేస్తుంటాను. కాబట్టి.. టీమిండియా మేనేజ్‌మెంట్ కీపింగ్ బాధ్యతలు తీసుకోమని కోరగానే పూర్తి ఆత్మవిశ్వాసంతో అంగీకరించాను. క్రికెట్‌ని రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్లకి కీపింగ్ చేస్తున్నాననే విషయం బాగా తెలుసు.. మ్యాచ్ సమయంలో అభిమానులు నా కీపింగ్‌ని ధోనీ ప్రదర్శనతో పోల్చి చూస్తున్నారు. ధోనీ స్థానాన్ని భర్తీ చేయడం అంత సులువు కాదు. అభిమానులు కూడా అంత ఈజీగా ఎవరినీ అంగీకరించరు అని చెప్పుకొచ్చాడు.

టీమిండియా మాజీ సారథి ధోని 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత జట్టుకు దూరమయ్యారు. ఈ ఏడాది ఐపీఎల్ ధోనీ రీఎంట్రీ ఇవ్వాలని, ఆ ఫామ్ లోకి వచ్చి ప్రపంచ కప్ సిద్దం కావాలని భావించారు. కరోనా కారణంగా అది వాయిదాపడటంతో.. ధోనీ రీఎంట్రీ మరింత సందిగ్ధదంలో పడిపోయింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories