Covid19: విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రీడాకారుల విరాళాలు..

Covid19: విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రీడాకారుల విరాళాలు..
x
Ajinkya Rahane (File Photo)
Highlights

దేశంలో కోవిడ్ మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రీడాలోకం బాసటగా నిలుస్తోంది.

దేశంలో కోవిడ్ మహమ్మారి సృష్టించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రీడాలోకం బాసటగా నిలుస్తోంది. టీమిండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే మహారాష్ట్ర సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఆదివారం రూ. 10 లక్షలు విరాళమిచ్చాడు. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ. 50 లక్షలు ఇవ్వనున్నట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ సంఘం తెలిపింది. స్టార్‌ ప్లేయర్లకు దీటుగా వర్ధమాన క్రీడాకారులు తమ ఉదారతను చాటుకున్నారు.

ఇక టీమిండియా 16 ఏళ్ల మహిళా క్రికెటర్‌ రిచా ఘోష్‌ పచ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సహాయనిధి కోసం లక్ష రూపాయల విరాళమిచ్చింది. మరోవైపు హైదరాబాద్‌ టీనేజ్‌ షూటర్, 15 ఏళ్ల ఇషా సింగ్‌ ప్రధానమంత్రి సహాయ నిధికి తన ఖాతా నుంచి రూ. 30 వేలు విరాళంగా ఇచ్చింది. వీరితో పాటు రెండు సార్లు ఆసియా పారా గేమ్స్‌ హైజంప్‌ చాంపియన్‌ శరద్‌ పవార్‌ (రూ. 1 లక్ష), బెంగాల్‌ మహిళల కోచ్‌ జయంత ఘోష్‌ (రూ. 10,000) విరాళం ఇచ్చారు. మొహమ్మదాన్‌ స్పోర్టింగ్‌ క్లబ్‌ ప్రతినిధి దీపక్‌ సింగ్‌ (రూ. 2 లక్షలు), మాజీ టెస్టు క్రికెటర్‌ మితు ముఖర్జీ 25,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ఇప్పటికే టీమిండియా మాజీ సారథి ధోని, జాఫర్, భజ్జీ లాంటి సీనియర్ క్రికెటర్ల విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories