ఈ ఏడాది విజయాలతో ఘనంగా వీడ్కోలు

ఈ ఏడాది విజయాలతో ఘనంగా వీడ్కోలు
x
Highlights

ఇక వరుస విజయాలతో 2019కి ఘన వీడ్కోలు పలికింది.

భారత క్రికెట్ జట్టుకు ఒక ప్రపంచ కప్ మినహాయించి ఈ సంవత్సరం అంతా విజయవంతంగా ముగిసింది. జట్టులో బౌలర్లు బ్యాట్స్ మెన్లు అంతా సమిష్టిగా రాణించి ఈ ఏడాది అత్యత్తమ జట్టుగా మారింది. 2019లో ప్రపంచ క్రికెట్లో అత్యధిక విజయాలు సొంతం చేసుకుంది.

టీమిండియా బ్యాటింగ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ అద్భుత ఫామ్ కొనసాగించారు. బౌలింగ్‌లో బుమ్రా ఈ ఏడాది అత్యుత్తమ బౌలర్ గా నిలిచారు. షమి తన డెలివరీలతో పత్యర్థులను కంగారు పెట్టారు. షమీని చూస్తే చిరుతపులి చూసినట్లు ఉందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నారు కూడా.. ఇషాంత్‌ టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శన చేశారు.

ఆస్ట్రేలియా సిరీస్‌లో సొంత గడ్డపై టెస్టు సిరీస్‌లో మట్టికరిపించి చరిత్ర సృష్టించింది. తార్వత జూన్ లో జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్‌ వరకు వెళ్లి న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. అయితే వరుస సిరీస్ విజయాలు సాధించింది. సౌతాఫ్రికా, మెస్టిండీస్ , బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్, ఇలా ప్రతి జట్టుపై పూర్తి స్థాయి ఆదిపత్యం ప్రదర్శించింది. ఇక ఆస్ట్రేలియాలో 2-1తో టెస్టు సిరీస్ విజయం సాధించి చారిత్రక విజయం నమోదు చేసింది.

ఇక వరుస విజయాలతో 2019కి ఘన వీడ్కోలు పలికింది. రోహిత్‌ శర్మ, కోహ్లీ విజృంభణతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది. ఈ సంవత్సరం భారత క్రికెట్ లో అడుగుపెట్టిన శివ్ దూబే లాంటి కొత్త ఆటగాళ్లు కూడా రాణించాడు. టెస్టుల్లో ఎప్పటిలానే విష్టర్ వాల్ పూజారా కూడా ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా జరిగిన రెండో టెస్టులో పుజారా ఆడలేదు. పుజారాను పక్కన పెట్టిన కోహ్లీకి రెండో టెస్టు ఓటమితో..అతని లోటు తెలిసోచ్చింది. దీంతో మూడో టెస్టులో పూజారా సెంచరీ చేయడం తోపాటు జట్టు విజయంలో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. టీమిండియా 2019లో కనబరిచిన ఆట తీరులానే 2020లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తుంది.

2020లో జనవరి 5నుంచి శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆడుతుంది. ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటన సందర్భంగా టెస్టు, వన్డే , టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. 2020 మార్చిలో ఐపీఎల్‌ సిద్ధంగా ఉంటుంది. ఇక జూన్‌లో శ్రీలంకతో సిరీస్‌లు మొదలవుతుంది. ఆగస్టులో జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌ ఆడనుంది. సెప్టెంబర్‌లో ఆసియాకప్‌ ఆడనుంది. ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా మూడు టీ20, మూడు వన్డేలు ఆడనుంది. అక్టోబర్‌లోనే టీ20 ప్రపంచకప్‌ జరగనుంది. నవంబర్‌లో ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. 2020ని కూడా ఘనంగా ఆరంభించాలని భారత క్రికెట్ జట్టు భావిస్తుంది. ఆసియాకప్, టీ20 ప్రపంచ కప్ పై దృష్టి సారించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories