Dhoni: రిషబ్ పంత్ కి కీపింగ్ మెళకువలు నేర్పుతూ కెమెరాకి చిక్కిన ధోని

* బుధవారం భారత్ - ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో రిషబ్ పంత్ కి కీపింగ్ లో మెళకువలు నేర్పున్న ధోని

Sandeep Reddy
Published on: 21 Oct 2021 5:43 PM IST
Team India Mentor MS Dhoni Keeping Tips to Rishabh Pant
X

రిషబ్ పంత్ కి కీపింగ్ మెళకువలు నేర్పుతూ కెమెరాకి చిక్కిన ధోని

Dhoni - Rishabh Pant: భారత మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని టీ20 ప్రపంచకప్ 2021 టీమిండియాకి మెంటార్ గా బాధ్యత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ధోని భారత జట్టుతో తిరిగి కలవడం ఎంతో సంతోషంగా ఉందని కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య వంటి ఆటగాళ్ళు ఇటీవల ఇంటర్వ్యూలలో చెప్పిన సందర్భాలు చూశాము.

తాజాగా ధోని బుధవారం భారత్ - ఆస్ట్రేలియా మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో బౌండరీ లైన్ వద్ద భారత ఆటగాడు రిషబ్ పంత్ కి కీపింగ్ లో మెళకువలు నేర్పుతూ కెమెరాకి చిక్కాడు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మ్యాచ్ మొదలైన మొదటి నాలుగు ఓవర్లు సైట్ స్క్రీన్ లో సమస్య ఉండటం వలన కెమెరాలు ఆ పక్కనే ఉన్న ధోనిపై ఫోకస్ చేశాయి. ఇక రిషబ్ పంత్ తో పాటు కీపింగ్ కి ఇషాన్ కిషన్ కూడా భారత్ సందర్భానుసారంగా ఉపయోగించుకోనున్నట్లు తెలుస్తుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story