4th Test: పంత్ సెంచరీతో పట్టు బిగించిన టీం ఇండియా

Team India Leading in 4th Test
x

రిషభ్ పంత్ (ఫొటో బీసీసీఐ టీవీ)

Highlights

4th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టుపై టీమ్‌ఇండియా ఆధిక్యం సాధించింది.

4th Test: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టుపై టీమ్‌ఇండియా ఆధిక్యం సాధించింది. రెండోరోజు ఆటముగిసే సరికి 294/7తో మ్యాచ్ పై పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 89 పరుగుల ముందంజలో ఉంది. టీం ఇండియా యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ (101; 118 బంతుల్లో 13×4, 2×6) సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (60 బ్యాటింగ్‌; 117 బంతుల్లో 8×4), అక్షర్‌ పటేల్‌ (11 బ్యాటింగ్‌; 34 బంతుల్లో 2×4) అజేయంగా నిలిచారు. రిషభ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌ ఒత్తిడిలోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ పై పైచేయి సాధించారు.

అంతకు ముందు ఓవర్‌నైట్‌ స్కోరు 24/1తో ఆట ఆరంభించిన భారత్‌కు మంచి ఓపెనింగ్ దొరకలేదు. చెతేశ్వర్‌ పుజారా (17), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (0) వెంట వెంటనే ఔటవ్వడంతో టీం ఇండియా ఒత్తిడిలో కూరుకపోయింది. ఈ క్రమంలో అజింక్య రహానె (27; 45 బంతుల్లో 4×4)తో కలిసి రోహిత్‌ శర్మ (49; 144 బంతుల్లో 7×4) పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ, అజింక్యను అండర్సన్‌ పెవిలియన్ కు పంపడంతో లంచ్ సమయానికి టీం ఇండియా స్కోర్ 80/4తో ఉంది. అనంతరం రోహిత్‌, అశ్విన్‌ (13) త్వరగా ఔటవ్వడంతో స్కోరు నెమ్మదించింది.

వాషింగటన్ సుందర్ (ఫొటో ట్విట్టర్ బీసీసీఐ)

వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి రిషభ్ పంత్‌ ఏడో వికెట్‌కు 158 బంతుల్లో 113 పరుగుల భాగస్వామ్యం అందించాడు. 115 బంతుల్లోనే సెంచరీ చేశాడు రిషబ్. 94 రన్స్ వద్ద సిక్సర్‌తో ఈ ఘనత అందుకోవడం విశేషం. కానీ, వెంటనే అండర్సన్‌ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత సుందర్‌ హాప్ సెంచరీ సాధించాడు. అతడికి అక్షర్‌ పటేల్‌ అండగా నిలిచాడు. మూడో రోజు టీం ఇండియా మరో 100 పరుగులు చేయగలిగితే చివరి మ్యాచ్‌ లోనూ విజయం భారత్ సొంతమవుతుందని విశ్లేషకులంటున్నారు.

నేటి మ్యాచ్‌లో విశేషాలు..

కోహ్లీ రికార్డులు...

  1. టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఖాతాలో ఓ చెత్త రికార్డు చేరింది. ఈ చెత్త రికార్డుతో మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ సరసన నిలవడం విశేషం. మొతేరా వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ డకౌటయ్యాడు. బెన్‌స్టోక్స్‌ విసిరిన ఓ షార్ట్‌పిచ్‌ బంతిని ఆడబోయి కీపర్‌ ఫోక్స్‌ చేతికి చిక్కాడు. టెస్టుల్లో ఇలా డకౌట్ ఔటవ్వడం కోహ్లీకిది ఎనిమిదోసారి‌. ధోనీ సైతం కెప్టెన్‌గా ఉన్న రోజుల్లో ఎనిమిది సార్లు టెస్టుల్లో ఇలా డకౌట్ అయ్యాడు. దీంతో వీరిద్దరూ భారత్‌ తరఫున అత్యధిక డకౌట్లు అయిన టెస్టు కెప్టెన్లుగా రికార్డులకెక్కారు. అలాగే విరాట్‌ కోహ్లీ కెరీర్‌లో ఓ సిరీస్‌లో రెండుసార్లు డకౌటవ్వడం ఇది రెండో సారి.
  2. ఇక ఈ మ్యాచ్‌లో బెన్‌స్టోక్స్‌.. విరాట్‌ను అత్యధికంగా ఐదు సార్లు పెవిలియన్‌ కు చేర్చాడు. మరే బ్యాట్స్‌మెన్‌ కూడా స్టోక్స్‌ చేతిలో ఇన్నిసార్లు ఔటవ్వలేదు.
  3. అలాగే విరాట్‌.. ధోనీకి సంబంధించిన మరో రికార్డును కూడా సమం చేశాడు. భారత్‌ తరఫున అత్యధిక టెస్టులకు కెప్టెన్సీ వహించిన రికార్డు(
    60
    )ను కోహ్లీ చేరుకున్నాడు.
  4. మూడో టెస్టులో భారత్‌ విజయం సాధించడంతో స్వదేశంలో అత్యధిక మ్యాచ్‌లు గెలుపొందిన కెప్టెన్ల జాబితాలో ధోనీ
    (21
    )ని కోహ్లీ(22) అధిగమించాడు.

రోహిత్ శర్మ @ 1000...

  1. టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో
    1000
    పరుగులు పూర్తి చేసిన తొలి ఓపెనర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న 4వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు
    49
    పరుగులు చేసి స్టోక్స్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ క్రమంలోనే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓపెనర్ల జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. రోహిత్‌ తర్వాత డేవిడ్‌ వార్నర్‌(
    948
    ), డీన్‌ ఎల్గర్‌(848) ఉన్నారు.
  2. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యంత వేగంగా 1000 రన్స్ పూర్తి చేసిన తొలి ఆసియా ఆటగాడిగానూ రోహిత్ రికార్డు నెలకొల్పాడు. అలాగే వైస్ కెప్టెన్ అజింక్య రహానె (
    1,068
    ) సైతం ఈ టెస్టు ఛాంపియన్‌షిప్‌ లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన మరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక మార్నస లబుషేన్‌(
    1,675
    ), జోరూట్‌(1,630), స్టీవ్‌స్మిత్‌(1,341), బెన్‌స్టోక్స్‌ (1,301) మాత్రమే భారత బ్యాట్స్‌మెన్‌ కన్నా ముందున్నారు.
  3. అలాగే రోహిత్‌.. మయాంక్‌ అగర్వాల్‌ పేరిట ఉన్న మరో రికార్డును చెరిపేశాడు. టెస్టుల్లో 17 ఇన్నింగ్స్‌ల్లోనే
    1000
    పరుగులు పూర్తి చేసిన తొలి ఆసియా ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మయాంక్‌ 19 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.
  4. ఇక టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో (17 ఇన్నింగ్స్ ల్లో) వేగవంతంగా 1000 రన్స్ పూర్తి చేసిన 2వ బ్యాట్స్‌మన్‌గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో వినోద్‌ కాంబ్లీ
    14
    ఇన్నింగ్స్‌ల్లో ఈ రికార్డును నమోదు చేశాడు. పుజారా 18 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు.
  5. టెస్టుల్లో ఆల్‌టైమ్‌ ఓపెనర్లలో అత్యంత వేగంగా
    1000
    పరుగులు చేసిన 3వ బ్యాట్స్‌మెన్‌గానూ రోహిత్‌ శర్మ మరో ఘనత సాధించాడు. దాంతో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌స్మిత్‌ సరసన నిలిచాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్‌ మాజీ ఓపెనర్లు హర్బర్ట్‌ సక్లిఫ్‌
    13
    ఇన్నింగ్స్‌, లెన్‌ హుట్టన్‌ 16 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించి తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
Show Full Article
Print Article
Next Story
More Stories