India Tour of England: టీం ఇండియా క్వారంటైన్‌ 3 రోజులే..!

Team India Players Will Now Stay in Hard Quarantine in England upto 3 days Before the Test Championship Final
x

టీం ఇండియా (ఫొటో ట్విట్టర్)

Highlights

India Tour of England: ఇంగ్లాండ్‌లో పర్యటించే ఇండియా టీంకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది.

India Tour of England: ఇంగ్లాండ్‌లో పర్యటించే టీం ఇండియాకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు గుడ్‌న్యూస్ చెప్పింది. కఠిన క్వారంటైన్‌ ఆంక్షలను సడలించడంతో ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ మేరకు గతకొన్ని రోజులుగా బీసీసీఐ ఈసీబీతో చర్చలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఎట్టకేలకు ఈసీబీ కఠిన క్వారంటైన్ రూల్స్‌ను సడలించింది. దీంతో పురుషులు, మహిళల టీంలు ఇంగ్లాండ్ చేరుకున్న నాలుగో రోజు నుంచే క్రికెట్ ప్రాక్టిస్ చేయనున్నారు.

ఇంగ్లాండ్ పర్యటనలో సుదీర్ఘంగా క్రికెట్ ఆడనుండడంతో.. ఆటగాళ్ల కుటుంబ సభ్యులూ ఇంగ్లాండ్‌ వెళ్లనున్నారు. ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రం 10 రోజుల కఠిన క్వారంటైన్‌ లో ఉండనున్నారు. వీరికీ మినహాయింపు ఇవ్వాలని బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది. మరి ఈసీబీ ఏమేరకు ఓకే చేస్తుందో చూడాలి.

ప్రస్తుతం మెన్స్, ఉమెన్స్ టీంలతోపాటు వారి కుటుంబాలతో సహా ముంబయిలో క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ క్వారంటైన్‌ పూర్తయ్యాక జూన్‌ 2న రెండు జట్లు ఒకే ఛార్టర్‌ విమానంలో ఇంగ్లాండ్‌ దేశానికి బయలుదేరనున్నాయి. కాగా, మెన్స్‌ టీం నేరుగా సౌతాంప్టన్‌ చేరుకుని, అక్కడే హోటల్‌లో క్వారంటైన్ అవుతుంది. మిథాలీ సేన మాత్రం బ్రిస్టల్‌కు వెళ్లి అక్కడి హోటల్‌ లో క్వారంటైన్ లో ఉండనున్నారు.

ఈ పర్యటనలో ఉమెన్స్‌ టీం జూన్‌ 16న ఇంగ్లాండ్‌తో ఒక టెస్టు మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. అలాగే మెన్స్‌ టీం జూన్‌ 18 నుంచి 22 వరకు న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో తలపడనుంది. ఆ తరువాత ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లాండ్‌తో 5 టెస్టులు ఆడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories