ధోనీ రీఎంట్రీ అవసరం లేదు : టీమిండియా మాజీ కీపర్

ధోనీ రీఎంట్రీ అవసరం లేదు : టీమిండియా మాజీ కీపర్
x
Syed Kirmani (File photo)
Highlights

టీమిండియా క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరగమనం అవసరం లేదని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అన్నారు.

టీమిండియా క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరగమనం అవసరం లేదని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణీ అన్నారు. 2019 వన్డే వరల్డ్ కప్‌లో కివీస్ పై ఆఖరి వన్డే ఆడిన తర్వాత ధోని జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వలేదు. వన్డే వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్లో టీమిండియా ఓడిపోవడం దానికి ధోనీ రనౌటే కారణం అని విమర్శలు వచ్చాయి. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి ఏడాదిగా ఊహాగానాలు, వార్తలు వినిపించాయి. కానీ ధోనీ మాత్రం పెదవి విప్పలేదు. రెండు రోజుల క్రితం అనూహ్యంగా#DhoniRetires కీవర్డ్ సోషల్ మీడియాలో ట్రెండ్‌గా మారింది. అతని భార్య సాక్షిధోని కాస్త ఘాటుగానే చురకలు కూడా వేసింది.

ఇప్పుడు మరోసారి ధోనీ రిటైర్మెంట్ అంశం తెరపైకి వచ్చింది. మళ్లీ రీఎంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదని కీర్మాణీ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా 'ధోనీకి ఎప్పుడు ఏం చేయాలో బాగా తెలుసు. కాబట్టే తన భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నాడు. మళ్లీ టీమిండియాకి ఆడతాడని అనుకోవట్లేదు. ఎందుకంటే.. ఇప్పటికే అతను తన లక్ష్యాల్ని, కలల్ని సాకారం చేసుకున్నాడు. ధోని సాధించాల్సి ఏముంది..? ఐపీఎల్‌‌లో ఆడేందుకు ధోనీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్ ధోని కెరీర్ లో చివరి టోర్నీ కావొచ్చు'' అని కీర్మాణీ జోస్యం చెప్పాడు.

భారత జట్టును ధోని కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌ని విజేతగా నిలిపాడు. క్రికెట్ చరిత్రలో ఓ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్‌గా ధోని రికార్డుల్లో కొనసాగుతున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories