Top
logo

IPL 2020: ధోనీని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు: సెహ్వాగ్

IPL 2020: ధోనీని చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు: సెహ్వాగ్
X

Virender Sehwag (file photo)

Highlights

IPL 2020 | అభిమానులు ఈ ఐపీఎల్ మరింత ప్రేత్యేకమైందని టీంఇండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

IPL 2020 | అభిమానులు ఈ ఐపీఎల్ మరింత ప్రేత్యేకమైందని టీంఇండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వత ధోనీ ఆడుతున్నాడని తోలి ఐపీఎల్ కావడం అందుకు కారణమన్నాడు. 'మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతున్న ధోనీని చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. అతడిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి' అని సెహ్వాగ్ చెప్పాడు.

ప్రపంచ‌వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఐపీఎల్‌ 2020 ఇంకో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న‌ది. తొలి మ్యాచ్ రన్నరప్ చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిపెడింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరగనుంది. ఇప్పటికే అన్ని జట్లన్నీ ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యాయి. ఈసారి ఐపీఎల్‌లో మ్యాచ్‌లన్నీ షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికగా జరగనున్నాయి. ఈ క్ర‌మంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఐపీఎల్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించాడు.

భారత ఉపఖండంలో ప్రసారం చేసే స్టార్ స్పోర్ట్స్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 120 దేశాల్లో క్రికెట్ ప్రసారాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఐసీసీ అనుబంధ సభ్యులుగా ఉన్న ప్రతీ దేశంలో ఐపీఎల్ ప్రసారం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి తగినట్లుగా ప్రొడక్షన్ టీం సన్నాహాలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 9 భాషల్లో ఐపీఎల్ ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు ఏడు భారత ప్రాంతీయ భాషల్లో వేర్వేరుగా ప్రసారం చేయనున్నారు. స్టార్ స్పోర్ట్స్‌కు చెందిన ప్రాంతీయ భాషా ఛానెల్స్‌లో ప్రతీ రోజు ప్రసారాలు ఉంటాయి.

Web TitleTeam India Former Cricketer Virender Sehwag interesting Comments on MS Dhoni about Ipl 2020
Next Story