లాక్‌డౌన్‌ ప్రకటించే ముందు వలసకూలీల గురించి ఆలోచించాల్సింది : భజ్జీ

లాక్‌డౌన్‌ ప్రకటించే ముందు వలసకూలీల గురించి ఆలోచించాల్సింది : భజ్జీ
x
Harbhajan Singh (File Photo)
Highlights

సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ర‌చూ సామాజిక అంశాల‌పై స్పందించే టీమిండియా సినీయ‌ర్ బౌల‌ర్ స్పిన్న‌ర్ హర్భజన్‌సింగ్ మ‌రో సారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌ర‌చూ సామాజిక అంశాల‌పై స్పందించే టీమిండియా సినీయ‌ర్ బౌల‌ర్ స్పిన్న‌ర్ హర్భజన్‌సింగ్ మ‌రో సారి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించే ముందు వలస కూలీల గురించి ఆలోచించాల్సిందన్నాడు. దేశం ముందు క్రికెట్‌ చాలా చిన్నదని, విప‌త్క‌ర ప‌రిస్తితుల్లో తాను క్రికెట్‌ గురించి ఆలోచించట్లేదని అన్నాడు. శనివారం ఓ ఆంగ్ల పత్రికతో భజ్జీ మాట్లాడుతూ.. కరోనా పరిస్థితులపై స్పందించాడు.

ప్ర‌స్థుతం తాను క్రికెట్‌ గురించి ఆలోచించట్లేదు. గత 15 రోజులుగా దాని ధ్యాసేలేదు. దేశం ముందు క్రికెట్‌ చాలా చిన్నది. ఒకవేళ ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నేను క్రికెట్‌ గురించి స్వార్థపరుడిని అవుతా. ఆరోగ్య భారత దేశమే ముందు త‌మ కర్తవ్యం. మనమంతా ఆరోగ్యంగా, జాగ్రత్తగా ఉంటేనే క్రీడలు జరుగుతాయి. ప్ర‌స్తుతం క్రికెట్ త‌న ఆలోచ‌న‌లో కూడా లేద‌ని భ‌జ్జీ పేర్కొన్నారు.

కరోనా మ‌హమ్మ‌రి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కలిసుండాలని, ఎవ‌రికైనా చెత‌నైతే సాయం దేశాన్ని తిరిగి యథాస్థితికి తీసుకురావాలని హర్భజన్‌సింగ్ పిలుపునిచ్చాడు. ప్ర‌స్తుతం దేశంలో కూలీల పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశాడు. వసతి, ఆహారం, ఉద్యోగం లేదని గుర్తుచేశాడు. ప్రభుత్వం వారికి భరోసా కల్పించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పరిస్థితులను చూస్తుంటే ఆందోళన కలుగుతోందని భజ్జీ వ్యాఖ్యానించాడు.

నగరాలు, పట్టణాలు లాక్‌డౌన్‌ అవుతాయనుకోలేద‌ని భ‌జ్జీ అన్నాడు. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురౌతాయని ఎవరూ ఊహించలేదు. వలస కూలీల గురించి ఆలోచించే సమయం కూడా ప్రభుత్వానికి లేకపోయింది. చాలా త్వరగా పరిస్థితులు మారిపోయాయి. ప్రజల కోసం సరైన నిర్ణయాలు తీసుకునే సమయం ఉందని ఆశిస్తున్నా అని టీమిండియా క్రికెట‌ర్ భ‌జ్జి పేర్కొన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories