చిరాకేసినా ప్రజలంతా ఇళ్లల్లో ఉండడమే మంచిది

చిరాకేసినా ప్రజలంతా ఇళ్లల్లో ఉండడమే మంచిది
x
Cheteshwar Pujara (File Photo)
Highlights

కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగ‌తి తెల‌సిందే. అయితే ప్ర‌ముఖులంతా ఇళ్ల‌కే ప‌రిమితమై ప‌లు లాక్ డౌన్ కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు.

కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగ‌తి తెల‌సిందే. అయితే ప్ర‌ముఖులంతా ఇళ్ల‌కే ప‌రిమితమై ప‌లు లాక్ డౌన్ కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. కాగా.. టీమిండియా టెస్టు బ్యాట్స్ మెన్ ఛెతేశ్వర్‌ పుజారా త‌న అభిప్రాయాల‌ను పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా లాక్ డౌన్ వేళ‌ చిరాకేసినా.. ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌న్నాడు. ఇలాంటి కఠిన సమయంలో అందూ ఇళ్లల్లో ఉండడమే మంచిదని చెప్పాడు. జీవితం కన్నా ఫ్రస్టేషన్‌ గొప్పది కాదన్నాడు.

ఖాళీ సమయంలో ఇంట్లో కొత్త పనులు చేయాల‌ని తాను అదే చేస్తున్న‌ట్ల వెల్ల‌డించాడు. ఇప్పుడు తన కూతురు అదితితో సమయాన్ని ఆస్వాదిస్తున్నానని, తనుంటే బోర్‌ కొట్టదని తెలిపాడు. త‌న కూతురు ఇంట్లో సంద‌డి చేస్తుంద‌ని తెలిపాడు.ఇక కివీస్ పర్యటన తర్వాత రంజీట్రోఫీ ఫైనల్లో విఫలమవ్వడంపై స్పందిస్తూ.. తాను వెన్నునొప్పితో బాధపడుతున్నానని చెప్పాడు. రెండు వారాలు విశ్రాంతి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెప్పార‌ని అన్నాడు. ఈ సమయంలో ఫిట్‌నెస్‌పై దృష్టిసారించానని, ఇంట్లో జిమ్‌ ఉందని చెప్పుకొచ్చాడు. ట్రైనర్‌ చెప్పినట్లుగా వర్కౌట్లు చేస్తున్నానన్నాడు. ప్రస్తుతం తాను క్రికెట్‌ గురించి ఆలోచించట్లేదని, ఇంట్లో ఎలాంటి మ్యాచ్‌లు చూడటం లేదన్నాడు. ఇంటి పనుల్లో తన భార్యకు చేదోడు వాదోడుగా ఉంటున్న‌ట్లు తెలిపాడు. సమయం దొరికితే సినిమాలు చూస్తున్నట్లు చెప్పాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories