రెండో టీ20 ఓటమిపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు

రెండో టీ20 ఓటమిపై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు
x
virat kohli
Highlights

భారత్ వరస విజయాలకు విండీస్ కళ్లెం వెసింది. తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

భారత్ వరస విజయాలకు విండీస్ కళ్లెం వెసింది. తిరువనంతపురం వేదికగా టీమిండియా వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో టీ20లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 171 పరుగుల విజయ లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే విండీస్ మ్యాచ్‌ను పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లపై విండీస్ ఓపెనర్ సిమన్స్‌ చెలరేగడంతో అలవోకగా విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో రెండు టీ20లు ముగిశాయి. ఇరు జట్లు చేరో మ్యాచ్ విజయం సాధించి సమానంగా నిలిచాయి. ఈ సిరీస్‌లోని మూడో టీ20 మ్యాచ్ వాఖండే స్టేడియం వేదికగా ముంబైలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తే వారికే సిరీస్ దక్కుతుంది.

అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా సారథి కోహ్లీ పట్టిన అద్భుతమైన క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ తమ జట్టు ఓటమికి ఫీల్డింగ్ కారణమన్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా శివమ్ దూబే భారీ ఇన్సింగ్స్ తో 15 ఓవర్లలో మంచి స్కోరు చేసి పటిష్ట స్థితిలో ఉంది. కానీ, తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ చివరి నాలుగు ఓవర్లలో 30 పరుగులే రాబట్టారన్నారు. చివరి ఓవర్లో ఎక్కువ పరుగులు చేసి ఉండాల్సిందన్నారు.

ఈ మ్యాచ్ లో తమ ఫేస్ బౌలర్లు విఫలమైయ్యారు. మా ఫిల్డింగ్ చెత్తగా ఉంది.కీలక క్యాచ్ లు నెలపాలు చేశామంటూ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విండీస్ జట్టు బౌలర్లలో మార్పుల చేసిన పెద్ద ఒరిగిదేమి లేదు. చివరి ఓవర్లు మా బ్యాట్స్ మెన్ రాణిస్తే మంచి స్కోరు నమోదు చేసేవాళ్లం అని అభప్రాయపడ్డాడు. తర్వత మ్యాచ్ కు మా ఫిల్డింగ్ మెరుగుపరుచుకుంటాం మని కోహ్లీ తెలిపారు. భారత్‌ ఇప్పటివరకు రెండు సంవత్సరాల్లో 16 మ్యాచ్‌ల్లో తొలుత బ్యాటింగ్‌ చేసి 8సార్లు ఓడిపోయింది. ఛేజింగ్‌లో 18 మ్యాచ్‌లు 14 మ్యాచ్‌ల్లో విజయం నమోదుచేసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories