Team India: జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన..

Team India Announced For Zimbabwe Tour
x

Team India: జింబాబ్వే పర్యటనకు భారత జట్టు ప్రకటన..

Highlights

Team India: 15 మందితో జట్టు ప్రకటన, ధావన్‌ సారథ్యంలోనే జింబాబ్వే టూర్

Team India: వెస్టిండీస్ లో పర్యటిస్తున్న టీమిండియా త్వరలో జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఆగస్ట్ 18 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం వెళ్లే భారత జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వెస్టిండీస్ సిరీస్‌లో ఆకట్టుకున్న శిఖర్ ధావన్ మరోసారి భారతజట్టును నడిపించనున్నాడు. 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని ఈ సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోకపోగా.. వాషింగ్టన్‌ సుందర్‌, దీపక్‌ చాహర్‌ చాన్నాళ్ల తర్వాత తిరిగి జట్టులోకి వచ్చారు. ఐపీఎల్‌కు ముందే గాయపడి టీమ్‌కు దూరమైన దీపక్‌ చాహర్‌ పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ సాధించి తిరిగి వచ్చాడు.

వెస్టిండీస్ వన్డే సిరీస్ కు కెప్టెన్ గా వ్వహరించిన శిఖర్ ధావన్ కు మరో సారి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఈ సిరీస్ కోసం మాజీ సారథి విరాట్ కోహ్లిని ఎంపిక చేస్తారని భావించారు. కానీ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇతర సీనియర్ ఆటగాళ్లందరికీ ఈ పర్యటన నుంచి విశ్రాంతి కల్పించారు. మళ్లీ ఆసియా కప్‌తోనే కోహ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలున్నాయి. గాయం కారణంగా లోకేష్ రాహుల్ జట్టుకు దూరంగా ఉన్నారు.

భారత్ టీంకు ఎంపికైన వారిలో శిఖర్ ధావన్ కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాజ్, శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్ ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆల్‌రౌండర్ దీపక్ చాహర్‌తో పాటు మరో స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్ 2022 సీజన్‌కు ముందు గాయపడ్డ దీపక్ చాహర్ చాన్నాళ్ల తర్వాత తిరిగి మైదానంలోకి బరిలోకి దిగుతున్నాడు. అటు కౌంటీ క్రికెట్‌లో సత్తా చాటుతున్న వాషింగ్టన్ సుందర్ సైతం చాలా రోజుల మళ్లీ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.

ఆగస్ట్ 18, 20, 22 తేదీల్లో జింబాబ్వెతో టీమిండియా యువజట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనున్నది. జింబాబ్వే పర్యటన ముగిసిన తర్వాత యూఏఈ వేదికగా ఆసియాకప్ మొదలు కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories