క్రికెట్ కంటే పోలీసు డ్యూటీనే క‌ష్టం

క్రికెట్ కంటే పోలీసు డ్యూటీనే క‌ష్టం
x
Highlights

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా 2007లో భార‌త్ పాకిస్తాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ అంద‌రికి గుర్తుండే ఉంటుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా 2007లో భార‌త్ పాకిస్తాన్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ అంద‌రికి గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ లో ఆఖ‌రి ఓవ‌ర్లో వేసిన అద్భుత‌మైన బౌలింగ్‌తో భార‌త్‌ను గెలిపించాడు జోగింద‌ర్

శ‌ర్మ‌. ప్ర‌పంచ‌క‌ప్ అనంతరమే హర్యానా ప్రభుత్వం జోగిందర్ శ‌ర్మ‌ సేవలను గుర్తించి రాష్ట్ర పోలీస్ శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని ఇచ్చింది. అప్ప‌టి నుంచి జోగింద‌ర్ శ‌ర్మ త‌న విధుల‌ను నిర్వ‌హిస్తున్నారు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోగింద‌ర్ మాట్లాడుతూ.. క్రికెట్ కంటే పోలీస్ ఉద్యోగం చాలా కష్టంగా ఉందని తెలిపాడు.

కరోనా వైరస్ విజృభిస్తున్న త‌రుణంలో డ్యూటీ చేయాలంటే భయంగా ఉందని జోగింద‌ర్ అన్నారు. కానీ దేశం కోసం సేవ చేస్తున్నానే భావ‌న‌ తనని ముందుకు నడిపిస్తుందని చెప్పుకొచ్చాడు. నా రోజు ఉదయం 6గంటలకే ప్రారంభం అవుతుంది. అత్యవసర కాల్స్‌కు సిద్దంగా.. ఉండటంతో పాటు 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. నేను విధులు నిర్వ‌హిస్తున్న‌ హిసార్‌ జిల్లాలో రూరల్‌ భాగం ఎక్కువ‌గా ఉంది చెక్‌పోస్ట్‌ వద్ద నిలబడి వాహ‌న‌దారుల‌కు కరోనాపై అవగాహన కల్పిస్తున్నా​.


అత్యవసరమైతేనే బయటికి రావాల‌ని, లేదంటే ఇంట్లోనే ఉండి సుర‌క్షితంగా ఉండాల‌ని సూచిస్తున్నాం. ఎలాంటి కారణం లేకుండా బ‌య‌ట తిరికే వారిపై చ‌ట్ట‌ ప్రకారం కేసులు కూడా పెడుతున్నాం. నిత్యవసర సరుకులు, మందుల కోసం వ‌చ్చేవారిని అనుమతిస్తున్నాం. సామాజిక దూరంతో పాటు మాస్క్‌లు ధరించాలని సూచిస్తున్నాం. ఉత్త‌ప్ర‌దేశ్, బీహార్‌ నుంచి వలస కూలీలు పెద్ద ఎత్తున కాలి నడకన సొంతూళ్లకు బయలు దేరారు. దీంతో తీవ్రంగా భయపడ్డాను. వారిని ఆపి కరోనాపై అవగాహన కల్పిస్తూ... ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన పున‌రావ‌స కేంద్రాల‌కు తరలించాం. మా టీం మెగా ఫోన్స్ వాడుతున్నప్పటికీ కొంచెం తేడా వచ్చినా.. పరిస్థితి మరోలా ఉంటుంది.

డ్యూటీ నేపథ్యంలో ఎక్కడెక్కడో తిరుగుతుండటంతో రోజుకు ఎంతోమందిని కలవడంతో ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను నెట్ట‌డం ఇష్టం లేక ఇంటికి వెళ్లకూడదని నిశ్చయించుకున్నా' అంటూ జోగింద‌ర్ శ‌ర్మ‌ చెప్పుకొచ్చాడు. 2018 వరకు క్రికెట్ ఆడిన‌ జోగిందర్ శ‌ర్మ‌ అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ఇక వీడ్కోలు అనంతరం డీఎస్పీగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. జోగిందర్ శ‌ర్మ టీమిండియా త‌రఫున నాలుగు వన్డేలు, నాలుగు టీ20 మ్యాచుల‌ను ప్రాతినిథ్యం వ‌హించాడు. 2007లో టీమిండియా టీ20 ప్ర‌పంచ క‌ప్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories