దయచేసి అతడి ఆచూకీ చెప్పండి : సచిన్

దయచేసి అతడి ఆచూకీ చెప్పండి : సచిన్
x
Sachin File Photo
Highlights

టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ తన ట్విటర్ల్‌లో పోస్టు చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. 18 ఏళ్ల తర్వాత అభిమానిని కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.

టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు సచిన్ తన ట్విటర్ల్‌లో పోస్టు చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. అందులో 18 ఏళ్ల తర్వాత సచిన్ తన అభిమానిని కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అతని చిరునామా తనకు తెలియదని, అతను ఎక్కడ ఉన్నాడో తెలిస్తే చెప్పాలని నెటిజన్లను సచిన్ కోరారు.

అయితే ఇంతకి సచిల్ పెట్టిన పోస్టు ఎంటంటే.. సచిన్ క్రికెట్ ఆడే రోజుల్లో చెన్నైలోని తాజ్‌ కోరమాండల్‌ హోటల్‌లో తన అభిమానిని ఒకరిని కలిశారు. కాగా.. అతను సచిన్ కి ఓ సలహా ఇచ్చారంట. అదేంటంటే ఎల్బో గార్డ్‌ విషయంలో ‎ఓ అభిమాని చేసిన సూచన నన్ను ‎ఆశ్చర్యపరిచింది.

అతని సూచన నచ్చింది. అతని సూచన ప్రకారం ఎల్బోగార్డ్‌ను నేను మార్చుకున్నాను, కాగా, ఇప్పుటు ఆ అభిమాని ఎక్కడ ఉన్నాడో తెలియదు. అతడిని నేను కలుసుకోవాలి అనుకుంటున్నాను. అతని సమాచారం తెలిస్తే చెప్పండి, అతన్ని కనుక్కొవడానికి సహాయం చేయండి అంటూ సచిన్ ట్వీట్ చేశారు. సచిన్ ట్వీట్ అనంతరం ఒక్కసారిగా అతడు సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయ్యాడు.

ఆ అభిమాని గురుప్రసాద్‌ 46 సంవత్సరాలు గతంలో రాహుల్ ద్రవిడ్‌, సచిన్‌ తాజ్‌లో కోరమాండల్‌ హోటల్‌లో బస చేశారు. ఆదే హోటల్లో సెక్యూరిటీ గార్డ్‌గా గురుప్రసాద్ పని చేస్తున్నాడు. ఓపని మీద సచిన్ తన రూమ్ నుంచి బయటకు వచ్చినప్పు గురుప్రసాద్ సచిన్ ఆటోగ్రాఫ్‌ అడిగాడు. పేపర్ లేకపోవడంతో సచిన్ గురుప్రసాద్ వద్ద ఉన్న బీట్ నోట్ బుక్‌లో ఆటోగ్రాఫ్ చేశాడు.

అదే సమయంలో సెక్యూరిటీ గార్డ్ సచిన్ ను అడిగిమరి ఓ సూచన ఇచ్చాడు. మీరు బ్యాటింగ్‌ సమయంలో ఎల్బోగార్డ్‌ వల్ల అసౌకర్యం చెందుతున్నారని దానిని సరిపడ సైజులో చేయించాలని చెప్పాడు. దీంతో సచిన్ అతడి మాటను అమలు చేశాడు. ఎల్బో గార్డ్‌ని మార్చి కొన్నేళ్ల పాటు క్రికెట్ కెరీర్ కొనసాగించాడు. దీంతో 18 సంవత్సరాల తర్వాత సచిన్‌ అతడిని కలవాలన్న ట్విటర్‌లో తన ఆకాంక్షను వెల్లడించారు.

దీంతో అతని ఆచూకీ దొరికింది. సచిన్ తన గురించిన ఇన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకొని ఆడగడంపై గురుప్రసాద్ సంతోషంతో వ్యక్తం చేశారు. సచిన్ తన ఇంటికి రావాలని ఆహ్వానించారు. దీంతో సచిన్ తనకు కొంత సమయం ఇవ్వాలని కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories