T20WorldCup‌ ‌: టీమిండియాను కంగారెత్తిస్తున్న ఆసీస్

T20WorldCup‌ ‌: టీమిండియాను కంగారెత్తిస్తున్న ఆసీస్
x
AUSvIND T20WorldCup
Highlights

టీ20 మహిళల ప్రపంచకప్‌ సమరం ఆరంభమైంది. ఈ టోర్నీలోని తొలి మ్యాచ్‌లో టీమిండియా, నాలుగు టైటిల్ సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ...

టీ20 మహిళల ప్రపంచకప్‌ సమరం ఆరంభమైంది. ఈ టోర్నీలోని తొలి మ్యాచ్‌లో టీమిండియా, నాలుగు టైటిల్ సాధించిన డిఫెండింగ్ ఛాంపియన్స్‌ ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్‌ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్‌ బ్యాటింగ్ ఆరంభించింది. ఆదిలోనే టీమిండియా కీలక వికెట్టు చేజార్చుకుంది. షఫాలీ వర్మ(29, 15 బంతుల్లో, 5ఫోర్లు, 1 సిక్సు) దూకుడుగా ఆడింది. ఓ భారీ షాట్ కు యత్నించి ఎలిసే పెర్రీ బౌలింగ్ లో సౌథర్‌లాండ్ క్యాచ్ ఔట్ గా దొరికిపోయింది. వెంటనే మరో ఓపెనర్ స్మృతి మంధాన (10) పరుగులు చేసి జెస్‌ జోనాసెన్ బౌలింగ్ వికెట్ల ముందు దొరికిపోయింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(2) నిరాశపరించింది. దీంతో ఏడు ఓవర్లు ముగిసేసమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 49 పరుగులు చేసింది. జెమిమా రోడ్రిగ్స్(3) దీప్తి శర్మ(1) పరుగుతో క్రీజులో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆరు పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది.



ఇరు జట్లలో కీలక ప్లేయర్లు వీరే:

భారత జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(కెప్టెన్‌), దీప్తి శర్మ, వేదా కృష్ణమూర్తి, శిఖా పాండే, తానియా భాటియా, అరుంధతి రెడ్డి, రాజేశ్వరి గైక్వాడ్‌, పూనమ్‌యాదవ్‌.

ఆస్ట్రేలియా జట్టు: ఆలిస్సా హేలీ, బెత్‌ మూనీ, ఆష్లీ గార్డ్‌నర్‌, మెగ్‌ లానింగ్(కెప్టెన్‌)‌, ఎలిసే పెర్రీ, రేచల్‌ హేన్స్‌, అన్నాబెల్‌ సౌథర్‌లాండ్‌, జెస్‌ జోనాసెన్‌, డెలిస్సా కిమ్మినీస్‌, మోలీ స్ట్రానో, మెగాన్‌ షట్‌.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories