T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ల్లో పరుగుల వరద.. టాప్ రన్ గెటర్స్ లిస్ట్‌లో మనోళ్లే!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లు ఈ మెగా వేదికపై తమ ప్రతిభను చాటుతూ రికార్డులు సృష్టించారు.

Rishvik
Published on: 4 Feb 2026 11:56 AM IST
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ల్లో పరుగుల వరద.. టాప్ రన్ గెటర్స్ లిస్ట్‌లో మనోళ్లే!
X

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ల్లో పరుగుల వరద.. టాప్ రన్ గెటర్స్ లిస్ట్‌లో మనోళ్లే!

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలు క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లు ఈ మెగా వేదికపై తమ ప్రతిభను చాటుతూ రికార్డులు సృష్టించారు. టీ20 వరల్డ్‌కప్ 2026 ఆరంభం కానున్న నేపథ్యంలో కనీసం 31 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ లిస్ట్‌లో భారత స్టార్ విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలవడం గమనార్హం.

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు టీ20 వరల్డ్‌కప్‌ల్లో 33 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 1292 పరుగులు చేశాడు. ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ల్లోనూ నిలకడగా రాణించే కోహ్లీ.. వరల్డ్‌కప్‌ల్లో భారత జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించాడు. అతడి బ్యాటింగ్ కన్సిస్టెన్సీ, చేజింగ్‌లో చూపించే క్లాస్ ఈ రికార్డుకు ప్రధాన కారణం. ఈ జాబితాలో రెండో స్థానంలో మరో భారత దిగ్గజం రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ 44 మ్యాచ్‌ల్లో 1220 పరుగులు చేసి తన పవర్ హిట్టింగ్ సామర్థ్యాన్ని నిరూపించాడు. ఓపెనర్‌గా భారీ ఇన్నింగ్స్ ఆడడంలో రోహిత్‌కు ప్రత్యేకమైన పేరు ఉంది. టీ20 వరల్డ్‌కప్‌ల్లో అతడి స్టార్ట్స్ భారత జట్టుకు ఎంతో కీలకంగా ఉండేవి.

మూడో స్థానంలో ఇంగ్లాండ్ స్టార్ జోస్ బట్లర్ ఉన్నాడు. 34 ఇన్నింగ్స్‌ల్లో 1013 పరుగులు సాధించిన బట్లర్.. తన దూకుడు బ్యాటింగ్‌తో మ్యాచ్‌లను ఒంటిచేత్తో తిప్పేసే సత్తా కలిగిన ఆటగాడు. కీలక సందర్భాల్లో బట్లర్ బ్యాట్ నుంచి వచ్చిన పరుగులు ఇంగ్లాండ్‌కు అనేక విజయాలు అందించాయి. నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఉన్నాడు. 41 మ్యాచ్‌ల్లో 984 పరుగులు చేసిన వార్నర్.. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే బౌలర్లపై విరుచుకుపడేవాడు. అతడి అగ్రెసివ్ బ్యాటింగ్ టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఆస్ట్రేలియాకు మంచి ఆరంభాలు ఇచ్చింది.

ఈ లిస్ట్‌లో వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ ఐదో స్థానంలో ఉన్నాడు. కేవలం 31 మ్యాచ్‌ల్లోనే 965 పరుగులు చేసిన గేల్.. టీ20 ఫార్మాట్‌కు సరికొత్త నిర్వచనం ఇచ్చిన ఆటగాడిగా నిలిచాడు. యూనివర్సల్ బాస్ భారీ సిక్సర్లు, మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మొత్తంగా చూస్తే.. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఆటగాళ్లంతా తమ దేశాల తరఫున టీ20 వరల్డ్‌కప్‌ల్లో అసాధారణ ప్రదర్శనలతో అభిమానుల హృదయాల్లో నిలిచారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ అగ్రస్థానం దక్కించుకోవడం భారత క్రికెట్ అభిమానులకు గర్వకారణంగా నిలుస్తోంది. బట్లర్ మిన్నగా ఈ ఎలైట్ లిస్ట్‌లో ఉన్న అందరూ టీ20లు ఆడడం లేదు.

Rishvik

Rishvik

Next Story