T20 World Cup 2nd Semi Final: ఉత్కంఠ పోరులో.. టీమిండియా ఘన విజయం.. ఫైనల్స్ లో భారత్!

T20 World Cup 2nd Semi Final: చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకుపోయింది
x

T20 World Cup 2nd Semi Final

Highlights

T20 World Cup 2nd Semi Final: చివరి ఓవర్ వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకుపోయింది

T20 World Cup 2nd Semi Final: క్రికెట్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ లాంటి మ్యాచ్. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన ఆట. భారత్ సెమీ ఫైనల్స్ ఆశలపై బెథల్ పరుగుల నీళ్లు చల్లుతుంటే ఊపిరి బిగబట్టి చూసిన టీమిండియా అభిమానులకు చివరి ఓవర్లో దక్కిన విజయం ఫుల్ కిక్ ఇచ్చింది. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన టీమిండియా 254 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది. 254 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతూ వచ్చింది. మొదట్లో వరుసగా వికెట్లు పడినా.. నిలదొక్కుకుంది. బెథల్ క్లాసిక్ సెంచరీ సహాయంతో ఒక దశలో విజయాన్ని అలవోకగా అందుకునేలా కనిపించింది. కానీ చివరి ఓవర్లలో భారత్ బౌలింగ్.. ఫీల్డింగ్ అద్భుతం చేసింది. దీంతో భారత్ ఇంగ్లాండ్ ను ఓడించి ఫైనల్స్ కు దూసుకుపోయింది.

ఈ విజయంతో టీ20 ప్రపంచ కప్‌లో భారత్ నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది. వాంఖడే స్టేడియంలో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్‌లో ఆ జట్టు ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించింది. టీమిండియా 2007, 2014, 2024లలో కూడా ఫైనల్‌కు చేరుకుంది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు మాత్రమే చేయగలిగింది.

జాకబ్ బెథెల్ 48 బంతుల్లో 105 పరుగులు చేశాడు, కానీ అతని జట్టు ఫైనల్‌కు చేరుకోవడానికి సహాయం చేయలేకపోయాడు.

సంజు సామ్సన్ అర్ధ సెంచరీ.. భారత్ 253/7

భారత జట్టు తరపున సంజు సామ్సన్ 89 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. శివమ్ దూబే 43 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 39, హార్దిక్ పాండ్యా 27, తిలక్ వర్మ 21 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ జట్టు తరపున విల్ జాక్స్ , ఆదిల్ రషీద్ 2-2 వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్ ఒక వికెట్ తీసుకున్నారు. 2 బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు.

ఇక మార్చి8 ఆదివారం జరిగే ఫైనల్స్ లో భారత్ జట్టు న్యూజిలాండ్ తో తలపడుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories