T20 World Cup 2026: ఆసీస్‌కు జింబాబ్వే షాక్.. టీమ్ ఇండియాకు రూట్ క్లియర్? ఆ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందా!

T20 World Cup 2026, Zimbabwe vs Australia: టీ20 ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియాకు జింబాబ్వే షాక్! ఈ ఓటమితో భారత్ ప్రపంచ కప్ గెలవడం ఖాయమని నెటిజన్లు ఎందుకు అంటున్నారు? 1983, 2007 నాటి ఆసక్తికరమైన గణాంకాలు మరియు మ్యాచ్ విశేషాలు ఇక్కడ చూడండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 13 Feb 2026 9:27 PM IST
T20 World Cup 2026
X

T20 World Cup 2026: ఆసీస్‌కు జింబాబ్వే షాక్.. టీమ్ ఇండియాకు రూట్ క్లియర్? ఆ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అవుతుందా!

T20 World Cup 2026, Zimbabwe vs Australia: టీ20 ప్రపంచ కప్ 2026లో పెను సంచలనం నమోదైంది. శుక్రవారం ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత పోరులో జింబాబ్వే 23 పరుగుల తేడాతో మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఈ ఓటమితో ఆస్ట్రేలియా షాక్‌కు గురవ్వగా, భారత అభిమానులు మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే, చరిత్రలో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించిన ప్రతిసారీ భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంది!

మ్యాచ్ విశేషాలు: మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (64 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను జింబాబ్వే బౌలర్లు వణికించారు. బ్లెస్సింగ్ ముజరబాని (4/17), బ్రాడ్ ఎవాన్స్ (3/23) ధాటికి ఆసీస్ 146 పరుగులకే ఆలౌట్ అయింది. మ్యాట్ రెన్‌షా (65) పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది.

భారత్ టైటిల్ కొట్టడం ఖాయమేనా? ఈ అరుదైన గెలుపు ఒక పాత సెంటిమెంట్‌ను తెరపైకి తెచ్చింది. గతంలో ప్రపంచ కప్ టోర్నమెంట్‌లలో జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించిన రెండు సందర్భాల్లోనూ భారతే విజేతగా నిలిచింది:

1983 వన్డే ప్రపంచ కప్: జింబాబ్వే 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ ఏడాది కపిల్ దేవ్ సారథ్యంలోని భారత్ తొలిసారి వరల్డ్ కప్ నెగ్గింది.

2007 టీ20 ప్రపంచ కప్: సౌత్ ఆఫ్రికాలో జరిగిన ఈ టోర్నీలో జింబాబ్వే ఆసీస్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ ఏడాది ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది.

ప్రస్తుతం 2026లో కూడా జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించడంతో, చరిత్ర పునరావృతమై భారత్ మరోసారి టైటిల్ ఎత్తుకోవడం ఖాయమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story