T20 World Cup 2026: ఫిబ్రవరి 21 నుంచి హై వోల్టేజ్ మ్యాచ్‌లు.. టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 షెడ్యూల్ ఇదే!

T20 World Cup 2026
x

T20 World Cup 2026: ఫిబ్రవరి 21 నుంచి హై వోల్టేజ్ మ్యాచ్‌లు.. టీ20 వరల్డ్‌కప్ సూపర్-8 షెడ్యూల్ ఇదే!

Highlights

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి.

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ 2026 సూపర్-8 దశకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదలైంది. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్-8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌లో కొలంబో వేదికగా న్యూజీలాండ్, పాకిస్తాన్ టీమ్స్ తలపడనున్నాయి. రెండు పటిష్ట టీమ్స్ తలపడనుండడంతో సూపర్-8 మొదటి పోరే రసవత్తరంగా సాగనుంది. ఫిబ్రవరి 21 నుంచి వరుసగా పలు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి.

ఫిబ్రవరి 22న కాండీలో శ్రీలంక, ఇంగ్లండ్ జట్లు పోటీపడతాయి. అదే రోజు మరో బిగ్ మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఫిబ్రవరి 23న వెస్టిండీస్, జింబాంబ్వే మ్యాచ్ ముంబైలో జరుగుతుంది. తదుపరి మ్యాచ్‌లలో ఫిబ్రవరి 24న ఇంగ్లాండ్–పాకిస్థాన్ పోరు కాండీలో, ఫిబ్రవరి 25న శ్రీలంక–న్యూజిలాండ్ మ్యాచ్ కొలంబోలో జరుగుతుంది. ఫిబ్రవరి 26న దక్షిణాఫ్రికా–వెస్టిండీస్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో, అలాగే భారత్–జింబాబ్వే మ్యాచ్ చెన్నైలో జరగనుంది.

ఫిబ్రవరి 27న ఇంగ్లాండ్–న్యూజిలాండ్ పోరు కొలంబోలో జరగనుండగా.. ఫిబ్రవరి 28న శ్రీలంక–పాకిస్థాన్ మ్యాచ్ కూడా అదే వేదికలో జరగనుంది. మార్చి 1న దక్షిణాఫ్రికా–జింబాబ్వే మ్యాచ్ అహ్మదాబాద్‌లో, అలాగే భారత్–వెస్టిండీస్ మ్యాచ్ కోల్‌కతాలో జరుగుతుంది. మొత్తానికి సూపర్-8 దశలో ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది. సెమీఫైనల్‌కు చేరేందుకు జట్లు అత్యుత్తమ ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. పటిష్ట జట్ల మధ్య జరిగే ఈ మ్యాచులు అభిమానులకు హై వోల్టేజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఖాయం.

సూపర్-8 చేరిన జట్లను సీడింగ్ ప్రకారం.. రెండు గ్రూప్స్‌గా విభజించారు. లీగ్ దశలో తలపడిన జట్లు సూపర్-8లో ఢీకొట్టవు. గ్రూప్ 1లో ఆతిథ్య జట్టు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. గ్రూప్-2లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక జట్లు ఉన్నాయి. సూపర్-8లో ప్రతి మ్యాచ్ కీలకమే. ఒక్కో జట్టు తన గ్రూపులోని మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్ 2లో నిలిచిన టీమ్స్ సెమీఫైనల్ ఆడుతాయి.

భారత్ మ్యాచ్‌లు:

భారత్ vs దక్షిణాఫ్రికా: ఫిబ్రవరి 22

భారత్ vs జింబాబ్వే: ఫిబ్రవరి 26

భారత్ vs వెస్టిండీస్: మార్చి 1

Show Full Article
Print Article
Next Story
More Stories