T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు కష్టమే.. సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026కు సమయం దగ్గరపడుతోంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది.

Rishvik
Published on: 1 Feb 2026 6:21 PM IST
T20 World Cup 2026
X

T20 World Cup 2026: సంజూ శాంసన్‌కు కష్టమే.. సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026కు సమయం దగ్గరపడుతోంది. భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో టీమిండియా బరిలోకి దిగుతోంది. సొంతగడ్డపై టీ20 వరల్డ్‌కప్‌ జరుగుతుండడం సూర్య సేనకు కలిసొచ్చే అంశం. అయితే వరల్డ్‌కప్‌ ముందు భారత జట్టు కాంబినేషన్‌పై చర్చలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా వికెట్‌కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ స్థానం విషయంలో అభిమానులు, విశ్లేషకుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సంజూ ప్రస్తుత ఫామ్, ఆత్మవిశ్వాసం గురించి ఆయన స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించడం నిజంగా కష్టమే. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే.. అతడిని తప్పిస్తే ఎవరు ఆడుతారు. తిలక్ వర్మ తనను తాను నిరూపించుకున్నాడు. సంజూ కూడా నిరూపించుకున్న ఆటగాడే కానీ ప్రస్తుతం అతడు ఫామ్‌లో లేడు. ఇది అతడి ప్రతిభకు సంబంధించింది కాదు. సంజూ సామర్థ్యంపై సందేహం లేదు కానీ.. ప్రస్తుత ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్‌కప్‌ లాంటి టోర్నీలో ప్రయోగాలకు చోటుండదు. న్యూజీలాండ్ సిరీస్‌లో సంజూకు ఐదు మ్యాచ్‌లలో అవకాశం ఇచ్చారు. కానీ అతడి అత్యధిక స్కోరు 24 మాత్రమే. అంతేకాదు అనవసర షాట్స్ ఆడి ఔటయ్యాడు. ఇవన్నీ చూస్తే అతడిలో ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తోంది' అని అన్నారు.

తిలక్ వర్మ ఫిట్‌నెస్‌పై సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్య చేశారు. 'తిలక్ వర్మ ఫిట్‌గా ఉంటే ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే తొలి మ్యాచ్‌లో సంజూ శాంసన్ ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఉండే అవకాశం లేదు' అని సన్నీ స్పష్టం చేశారు. అంటే సంజూ టీ20 వరల్డ్‌కప్‌ 2026 ఆరంభ మ్యాచ్‌లో ఆడటం కష్టమేనని ఆయన సంకేతాలు ఇచ్చారు. మొత్తానికి గవాస్కర్ వ్యాఖ్యలతో సంజూ భవితవ్యం మరోసారి చర్చకు వచ్చింది. ప్రతిభ ఉన్నా ఫామ్ లేకపోతే పెద్ద టోర్నీలో అవకాశం దక్కడం కష్టమనే విషయాన్ని ఈ వ్యాఖ్యలు స్పష్టంగా చెబుతున్నాయి. మరి సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. టీ20 వరల్డ్‌కప్‌లో సంజూ ఆడతాడా? లేదా తిలక్ వర్మే ఫైనల్ ఎంపిక అవుతాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. న్యూజీలాండ్‌ టీ20 సిరీస్‌లోని 5 మ్యాచ్‌ల్లో సంజూ వరుసగా 10, 6, 0, 24, 6 స్కోర్లు చేశాడు. 9.2 సగటుతో 46 పరుగులు మాత్రమే చేశాడు.

Rishvik

Rishvik

Next Story