India Qualification Scenario: అసాధ్యమేమీ కాదు.. మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఇలా సెమీస్ చేరొచ్చు!

India Qualification Scenario: అసాధ్యమేమీ కాదు.. మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఇలా సెమీస్ చేరొచ్చు!
x

India Qualification Scenario: అసాధ్యమేమీ కాదు.. మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడకుండా భారత్ ఇలా సెమీస్ చేరొచ్చు!

Highlights

స్వంత విజయాలతోనే సెమీస్ దారి సులువు.. కీలక మ్యాచ్‌ల్లో గెలిస్తే భారత్‌కు ఇక ఎలాంటి లెక్కలు అవసరం లేదు!

టీ20 ప్రపంచకప్‌ 2026 సూపర్-8 మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. గ్రూప్-2 నుంచి ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ చేరగా.. గ్రూప్-1 నుంచి వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు ముందంజలో ఉన్నాయి. గ్రూప్-1లో ఉన్న భారత్.. దక్షిణాఫ్రికాపై భారీ తేడాతో ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు సన్నగిల్లాయి. మెగా టోర్నీలో టీమిండియా సెమీ ఫైనల్స్ అవకాశాలు ప్రస్తుతం నెట్ రన్‌రేట్ సమీకరణాలపై ఆధారపడి ఉన్నాయి. అయితే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడకుండా కూడా భారత్ ముందుకు వెళ్లే కొన్ని ఛాన్సెస్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

మొదటి సినారియో:

వెస్టిండీస్ 180 పరుగులు చేస్తే.. దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో లక్షాన్ని ఛేదించాలి. అప్పుడు సఫారీ టీమ్ నెట్ రన్‌రేట్ భారీగా పెరుగుతుంది. మరోవైపు భారత్ సెమీస్ చేరాలంటే జింబాబ్వేపై కనీసం 250 పరుగులు చేసి.. 150 పరుగుల తేడాతో గెలవాలి. ఇది జరిగితేనే దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల నెట్ రన్‌రేట్‌ను సూర్య సేన దాటే అవకాశం ఉంటుంది.

రెండో సినారియో:

దక్షిణాఫ్రికా ముందుగా 180 చేస్తే.. వెస్టిండీస్ 18 ఓవర్లలో చేజ్ చేయాలి. అప్పుడు విండీస్ నెట్ రన్‌రేట్ భారీగా పెరుగుతుంది. ఈ సందర్భంలో కూడా జింబాబ్వేపై భారత్‌ భారీ విజయం సాధించాలి. కనీసం 150 పరుగుల తేడాతో గెలిస్తేనే సెమీస్ అవకాశాలు బలపడతాయి.

జింబాబ్వేపై భారత్‌ భారీ విజయం సాధిస్తే సరిపోదు. తదుపరి సూపర్-8 మ్యాచ్‌లో కోల్‌కతాలో వెస్టిండీస్‌పై కూడా టీమిండియా గెలవాల్సిందే. రెండు వరుస మ్యాచ్‌లలో భారీ విజయాలు సాధిస్తేనే.. భారత్ సెమీఫైనల్ బెర్త్ ఖాయం అవుతుంది. భారత్‌కు సెమీస్ మార్గం కష్టమైనదే కానీ.. అసాధ్యం కాదు. భారీ స్కోర్లు, పెద్ద మార్జిన్ విజయాలు సాధిస్తే.. సెమీస్ చేరే అవకాశం ఉంది. దాంతో ఇప్పుడు అభిమానుల దృష్టి మొత్తం భారత్ తదుపరి మ్యాచ్‌లపైనే ఉంది. ఫిబ్రవరి 26న చెన్నై చెపాక్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు భారత్, జింబాబ్వే మ్యాచ్ ఆరంభం కానుంది. ఇక మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో టీమిండియా తలపడనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories