T20 World Cup 2026: భారత క్రికెటర్ల కెరీర్‌లపై టీ20 వరల్డ్‌కప్ ప్రభావం.. లిస్ట్ పెద్దదే గురూ!

T20 World Cup 2026: భారత క్రికెటర్ల కెరీర్‌లపై టీ20 వరల్డ్‌కప్ ప్రభావం.. లిస్ట్ పెద్దదే గురూ!
x

T20 World Cup 2026: భారత క్రికెటర్ల కెరీర్‌లపై టీ20 వరల్డ్‌కప్ ప్రభావం.. లిస్ట్ పెద్దదే గురూ!

Highlights

టీ20 వరల్డ్‌కప్ ప్రదర్శనతోనే భవిష్యత్తు నిర్ణయం?.. జట్టులో పలువురు ఆటగాళ్లకు ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్ కావొచ్చు.

టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ప్రతి జట్టు, ఆటగాడికి ఎంతో ప్రత్యేకం. టోర్నీలో ఆడి హీరోలు అయిన ప్లేయర్స్ ఉన్నారు.. అలానే జీరోస్ అయిన ఆటగాళ్లు కొద ఉన్నారు. ఈ జాబితాలో భారత ఆటగాళ్ల లిస్ట్ కాస్త పెద్దదే అని చెప్పాలి. టీ20 వరల్డ్‌కప్ 2026 జరుగుతున్న నేపథ్యంలో మెగా టోర్నీలు భారత క్రికెటర్ల కెరీర్‌లపై ప్రభావం చూపుతున్నాయా అనే చర్చ మరోసారి క్రికెట్ వర్గాల్లో తెరపైకి వచ్చింది. గత కొన్ని ఎడిషన్‌ల తర్వాత పలువురు స్టార్ ఆటగాళ్లు జట్టులో స్థానం కోల్పోవడం లేదా కెరీర్ చివరి దశకు చేరుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్ తర్వాత ఎంపికల విధానం, జట్టు వ్యూహం గురించి అభిమానులు, క్రికెట్ నిపుణులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

2022 టోర్నీ అనంతరం కేఎల్ రాహుల్, మొహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దినేష్ కార్తిక్, హర్షల్ పటేల్, దీపక్ హుడా వంటి ఆటగాళ్ల కెరీర్‌లు టీ20 ఫార్మాట్‌లో ఇరకాటంలో పడ్డాయి. దాదాపుగా ఎవరూ కూడా టీ20 ఫార్మాట్‌లో ఆడలేదు. అదే విధంగా 2024 తర్వాత రిషభ్ పంత్, యుజ్వేంద్ర చాహల్‌లకు అవకాశాలు టీ20 ఫార్మాట్‌లో తగ్గాయి. ఇక తాజా 2026 టోర్నీ తర్వాత సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్ల భవిష్యత్తుపై కూడా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మెగా టోర్నీల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోతే.. సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడమే ఇందుకు కారణం.

అయితే ఆటగాళ్ల కెరీర్ పూర్తిగా ముగియలేదు. ఫామ్, ఫిట్‌నెస్, జట్టు అవసరాలు బట్టి ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రావడం కూడా సాధ్యమే. గతంలో చాలా మంది ఆటగాళ్లు డ్రాప్ అయిన తర్వాత తిరిగి జట్టులోకి వచ్చారు. ఏదేమైనా టీ20 వరల్డ్‌కప్ తర్వాత భారత జట్టులో పెద్ద మార్పులు రావడం ట్రెండ్‌గా మారిందని నిపుణులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్‌కప్ ఫలితాలు మాత్రమే కాకుండా, టోర్నీ తర్వాత జరిగే ఎంపికలు కూడా ఆటగాళ్ల కెరీర్ను ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే సిరీస్‌ల్లో ఈ ఆటగాళ్లు ఎలా రాణిస్తారన్నదే వారి భవిష్యత్తును నిర్ణయించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories