T20 World Cup 2026: నమీబియాతో మ్యాచ్‌.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌పై బిగ్ అప్‌డేట్!

T20 World Cup 2026
x

T20 World Cup 2026: నమీబియాతో మ్యాచ్‌.. భారత్ ప్లేయింగ్ ఎలెవన్‌పై బిగ్ అప్‌డేట్!

Highlights

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది.

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఇక ఫిబ్రవరి 12న నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌పై ఓ అప్‌డేట్ వచ్చింది. జట్టులో 1-2 మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నమీబియాపై బరిలోకి దిగే భారత తుది జట్టు ఎలా ఉండనుందో చూద్దాం.

తాజా సమాచారం ప్రకారం... అభిషేక్ శర్మ ఇంకా తీవ్ర జ్వరం, కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అతడి పరిస్థితిని జట్టు యాజమాన్యం గమనిస్తోంది. నమీబియాతో మ్యాచ్‌కు ముందు అభిషేక్ పూర్తిగా కోలుకోకపోతే.. విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 15న పాకిస్తాన్‌తో జరగనున్న కీలక మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకుని విశ్రాంతి ఇవ్వాలని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్టు సమాచారం. అభిషేక్ స్థానంలో సంజూ శాంసన్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. సంజూ ఫిట్‌గా ఉండటంతో పాటు మిడిల్ ఆర్డర్‌లోనూ, ఓపెనర్‌గానూ ఆడగల సామర్థ్యం ఉండటం జట్టుకు అదనపు బలం అవుతుందని సెలెక్టర్లు భావిస్తున్నారు.

భారత అభిమానులకు ఓ శుభవార్త. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని టీమ్ వర్గాలు స్పష్టం చేశాయి. నమీబియాతో మ్యాచ్‌కు బుమ్రా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో బుమ్రా ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వస్తాడు. అమెరికాపై సిరాజ్ మూడు వికెట్లతో సత్తాచాటిన విషయం తెలిసిందే. అయినా బుమ్రా రాకతో ప్లేయింగ్ 11 నుంచి తప్పుకోక తప్పదు. డెత్ ఓవర్లలో అనుభవం, కట్టుదిట్టమైన లైన్-లెంగ్త్‌తో బుమ్రా జట్టుకు కీలక ఆయుధంగామారిన విషయం తెలిసిందే.

అర్షదీప్ సింగ్ మరో పేస్ బౌల‌ర్‌గా ఆడనున్నాడు. మూడో పేసర్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఆడనున్నారు. శివమ్ దూబే, రింకూ సింగ్ ఫినిషర్లుగా ఆడనున్నారు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ మిడిల్ భారాన్ని మోయనున్నారు. నమీబియాతో మ్యాచ్‌లో టీమ్ ఇండియా పూర్తి స్థాయిలో బలంగా బరిలోకి దిగాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్‌తో జరిగే హై వోల్టేజ్ మ్యాచ్‌ను కూడా దృష్టిలో పెట్టుకుని ప్లేయింగ్ ఎలెవన్‌పై జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ అప్‌డేట్స్‌తో భారత అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories