
T20 World Cup 2026
T20 World Cup 2026: ప్రపంచ కప్ లో ఎన్నో అందరూ ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ దారుణంగా విఫలం అయ్యాడు . డూ ఆర్ డై మ్యాచ్ లో కూడా త్వరగా అవుటై నిరాశపరిచాడు .
T20 World Cup 2026: ఇంగ్లాండ్‌తో జరిగిన T20 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిషేక్ కీలకమైన మ్యాచ్ ప్రారంభంలోనే ఔటయ్యాడు. అయితే, సంజు సామ్సన్ అర్ధ సెంచరీ సాధించడం ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నాడు. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ విఫలమైనప్పటికీ, సంజు ఎదురుదాడి చేశాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన T20 ప్రపంచ కప్ సెమీఫైనల్లో టీం ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఇన్నింగ్స్ వస్తుందని అందరూ ఎదురు చూశారు. ఎందుకంటే మొత్తం ప్రపంచ కప్‌లో ఒక అర్ధ సెంచరీ చేయడం తప్ప, మిగిలిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పెద్దగా ఆడింది లేదు. అందువలన, డూ-ఆర్-డై మ్యాచ్‌లో అభిషేక్ మెరుస్తాడని భావించారు. కానీ, ఆ అంచనాలు వమ్ము అయ్యాయి.
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి భారత్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అభిషేక్ శర్మ - సంజు సామ్సన్ భారత్ తరపున ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. తొలి ఓవర్లోనే భారత్‌కు మంచి ఆరంభం లభించింది. రెండో ఓవర్ కూడా బాగానే స్టార్ట్ అయింది.
తొలి ఓవర్లోనే రెండు భారీ హిట్లతో సంజు సామ్సన్ జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. మరోవైపు, ఇంగ్లీష్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్ చివరి బంతికి అభిషేక్ ఒకే పరుగు చేసి తన ఖాతా తెరిచాడు.
T20 World Cup 2026: విల్ జాక్స్ వేసిన రెండో ఓవర్లో అభిషేక్ తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. అభిమానులు ఇక అభిషేక్ బ్యాట్ మెరుస్తుందని భావించారు. కానీ, వారిని నిరాశ పరిచాడు అభిషేక్. టీమిండియా స్కోరు 20 పరుగుల వద్ద అందరికీ షాక్ ఇచ్చాడు. పెద్ద షాట్ ఆడటానికి ప్రయత్నించి, అభిషేక్ శర్మ సాల్ట్‌కు మిడ్-వికెట్ వైపు క్యాచ్ ఇచ్చాడు.
అభిషేక్ ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, సంజు సామ్సన్ తో కలిసి జట్టును 100 పరుగుల మార్కును దాటించాడు. ఆరంభంలోనే తనకు లభించిన జీవిత వరాన్ని సద్వినియోగం చేసుకున్న సంజు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ కూడా ఆడాడు.
మొత్తంగా చూసుకుంటే, అభిమానుల ఆశల్ని అభిషేక్ శర్మ పూర్తిగా వమ్ము చేశాడు. ఈ టోర్నీ మొత్తం టీమిండియాలో అత్యధికంగా చర్చలో నిలిచిన బ్యాటర్ అభిషేక్ శర్మ. ఈ పేలవమైన ఇన్నింగ్స్ తో మరోసారి పెద్ద చర్చకు.. దుమారానికి కేంద్ర బిందువు అయ్యాడు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




