T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: T20 ప్రపంచ కప్ 2026లో రెండవ సెమీఫైనల్ భారత్ - ఇంగ్లాండ్ మధ్య సాయంత్రం 7:00 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు జట్లు ముంబైలోని వాంఖడే స్టేడియంకు చేరుకున్నాయి.
ఈ రెండు జట్లు వరుసగా మూడోసారి సెమీఫైనల్లో తలపడనున్నాయి. గతంలో, 2022 , 2024లో ఈరెండు టీమ్స్ మధ్య సెమీస్ జరిగాయి. రెండు జట్లు 1-1 తేడాతో గెలిచాయి. సెమీఫైనల్స్ గెలిచిన తర్వాత, రెండు జట్లు కూడా ఫైనల్‌ను గెలుచుకున్నాయి.
భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 సెమీ ఫైనల్ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ ఇక్కడ చూడొచ్చు. లైవ్ స్కోర్స్ కోసం ఫాలో అవుతూనే ఉండండి
Live Updates
- 5 March 2026 1:35 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: పూర్తయిన మొదటి ఓవర్
మొదటి ఓవర్ పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్: 12/0
సంజూ శాంసన్: 11
అభిషేక్ శర్మ: 1
బౌలర్: జొఫ్రా ఆర్చర్.. ఈ ఓవర్ లో.. 12 పరుగులు
- 5 March 2026 1:30 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: బ్యాటింగ్ ప్రారంభిచిన టీమిండియా
మొదటి ఓవర్ బౌలింగ్ చేస్తున్న జొఫ్రా ఆర్చర్
- 5 March 2026 1:15 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: రెండు టీమ్స్ ఆరు సార్లు సెమీస్ కి చేరాయి
- టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ఆరోసారి సెమీఫైనల్‌కు చేరుకుంది. గతంలో 2007, 2014, 2016, 2022, 2024లో ఆ జట్టు టాప్ నాలుగు స్థానాల్లో నిలిచింది. ఐదు సెమీఫైనల్స్‌లో మూడింటిని గెలుచుకుంది.
- ఇంగ్లాండ్ కూడా ఆరోసారి సెమీఫైనల్స్‌లో ఆడుతోంది. గతంలో, ఆ జట్టు 2010, 2016, 2021, 2022, 2024లో ఈ దశకు చేరుకుంది. మూడు సెమీఫైనల్స్‌లో విజయం సాధించడం ద్వారా వారు ఫైనల్స్ లో ఆడారు
- 5 March 2026 1:12 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: ప్లేయింగ్ XI
భారత్: సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
ఇంగ్లాండ్: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (wk), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్ (c), సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జామీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
- 5 March 2026 1:09 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: సూర్యకుమార్ యాదవ్ టాప్ ఫామ్ లో
ఈ T20 ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను 7 మ్యాచ్‌ల్లో 231 పరుగులు చేశాడు. సూర్య అత్యుత్తమ స్కోరు 84. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించాడు. 7 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు.
- 5 March 2026 1:06 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: భారత్-ఇంగ్లాండ్ హెడ్ టు హెడ్
- భారత్, ఇంగ్లాండ్ ఇప్పటివరకు మొత్తం 29 టీ20 మ్యాచ్‌లు ఆడాయి.
- భారత్ 17, ఇంగ్లాండ్ 12 మ్యాచ్‌లు గెలిచాయి.
- టీ20 ప్రపంచ కప్‌లో ఇరు జట్లు ఐదు మ్యాచ్‌లు ఆడగా, భారత్ మూడు, ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లు గెలిచాయి.
- 5 March 2026 1:04 PM GMT
T20 World Cup 2026 2nd Semi Final LIVE Updates: టాస్
టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




