Australia vs South Africa: 119 పరుగుల లక్ష్యచేధనలో తడబడుతున్న ఆసీస్

T20 World Cup 2021 Starts Australia vs South Africa T20 Match Today 23 10 2021
x

Australia vs South Africa: 119 పరుగుల లక్ష్యచేధనలో తడబడుతున్న ఆసీస్

Highlights

* దక్షిణాఫ్రికా నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు సాధించింది.

Australia vs South Africa: టీ20 ప్రపంచకప్ లో భాగంగా శనివారం అబుధాబి వేదికగా ఆస్ట్రేలియా - దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు బౌలర్స్ అద్భుత బౌలింగ్ తో దక్షిణాఫ్రికా జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణిత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులు సాధించింది.

దక్షిణాఫ్రికా ఆటగాళ్ళలో మక్రమ్ 40 పరుగులు మినహా ఎవరు అంతగా రాణించలేకపోవడంతో తక్కువ పరుగులకే కుప్పకూలింది. ఇక ఆసీస్ బౌలింగ్ లో జంపా, స్టార్క్, హజెల్ వుడ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ ఆరంభంలోనే తడబడింది. 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 51 పరుగులతో లక్ష్య చేధనలో గెలుపు కోసం చెమటోడుస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories