T20 World Cup 2021 - Scotland vs Namibia: పసికూనల పోరులో నెగ్గేదేవరో!?

T20 World Cup 2021 Scotland Vs Namibia Match Preview Today 27th October 2021 - Cricket News
x

Scotland vs Namibia: పసికూనల పోరులో నెగ్గేదేవరో..!?

Highlights

T20 World Cup 2021 - Scotland vs Namibia: క్వాలిఫైయర్ మ్యాచ్ లలో అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ 2021లో స్థానం పొందిన స్కాట్లాండ్, నమీబియా జట్లు నేడు...

T20 World Cup 2021 - Scotland vs Namibia: క్వాలిఫైయర్ మ్యాచ్ లలో అద్భుత ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్ 2021లో స్థానం పొందిన స్కాట్లాండ్, నమీబియా జట్లు నేడు గ్రూప్ 2 లీగ్ మ్యాచ్ లలో భాగంగా తలపడనున్నాయి. అబుదాభిలోని షేక్ జాయెద్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో స్కాట్లాండ్, నమీబియా జట్ల మధ్య పోటీ జరగనుంది. ఇక స్కాట్లాండ్ మరియు నమీబియా ఇరు జట్లు మంచి పేస్ బౌలింగ్ అటాక్‌ను కలిగి ఉన్నా స్పిన్ బౌలింగ్ లో స్కాట్లాండ్ బలహీనత గత మ్యాచ్ లలో బయటపడింది.

స్పిన్ బౌలింగ్ లో అటు బంగ్లాదేశ్ మ్యాచ్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లోనూ అత్యధిక వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్ జట్టు బలహీనతను నమీబియా జట్టు ఈ మ్యాచ్ లో స్పిన్నర్ లను ఉపయోగించుకొని గెలుపొందాలని వేచిచూస్తుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర పరాజయం పొందిన స్కాట్లాండ్ జట్టు, గ్రూప్ స్టేజీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని నమీబియాతో జరగనున్న మ్యాచ్ లో తమ ఆట తీరును ప్రదర్శించనుందో ఈరోజు మ్యాచ్ తో తేలనుంది. ఇక సాయంత్రం మంచు ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ని ఎంచుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మ్యాచ్ వివరాలు:

  • స్కాట్లాండ్ - నమీబియా
  • అక్టోబర్ 27(బుధవారం) 2021
  • సాయంత్రం 7.30 నిమిషాలు
  • షేక్ జాయెద్ స్టేడియం, అబుదాభి

హెడ్ టు హెడ్ :

స్కాట్లాండ్, నమీబియా మధ్య జరిగిన 2 టీ20 మ్యాచ్ లలో నమీబియా 2 మ్యాచ్ లలో విజయం సాధించింది.

నమీబియా జట్టు:

జేన్ గ్రీన్, క్రెయిగ్ విలియమ్స్, మైఖేల్ వాన్ లింగెన్, గెర్హార్డ్ ఎరాస్మస్ (సి), డేవిడ్ వైస్, స్మిత్, జాన్ ఫ్రైలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్

స్కాట్లాండ్ జట్టు:

జార్జ్ మున్సే, కైల్ కోయెట్జర్ (సి), మాథ్యూ క్రాస్, రిచీ బెరింగ్టన్, కాలమ్ మాక్లియోడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ డేవీ, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ వీల్

Show Full Article
Print Article
Next Story
More Stories