T20 World Cup 2021 - New Zealand Vs Scotland: నేడు స్కాట్లాండ్ తో కివీస్ పోరు

T20 World Cup 2021 New Zealand Vs Scotland Match Preview Today 03rd November 2021 - Cricket News
x

T20 World Cup 2021 - NZ Vs Scotland: నేడు స్కాట్లాండ్ తో కివీస్ పోరు

Highlights

* టీ20 ప్రపంచకప్ 2021 లో గ్రూప్ 2 లో భాగంగా నేడు స్కాట్లాండ్ తో తలపడనున్న న్యూజిలాండ్ జట్టు

T20 World Cup 2021 - New Zealand Vs Scotland: దుబాయ్ వేదికగా నవంబర్ 3న(బుధవారం) గ్రూప్ 2 లోని స్కాట్లాండ్ - న్యూజిలాండ్ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే పాకిస్తాన్ తో ఓటమి తరువాత టీమిండియాతో జరిగిన కీలక మ్యాచ్ లో ఘన విజయం సాధించిన కివీస్ జట్టు స్కాట్లాండ్ తో జరిగే మ్యాచ్ లోను విజయం సాధించి సెమీస్ కి మరింత చేరువకావాలనే పట్టుదలతో ఉంది.

ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలోను ఓటమిపాలైన స్కాట్లాండ్ టీ20 వరల్డ్ కప్ లో ఒక విజయం సాధించైనా బోణి కొట్టాలని చూస్తుంది. ఇక నామమాత్రంగా జరగనున్న ఈ మ్యాచ్ లో కివీస్ జట్టుకే గెలుపు అవకాశాలున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ స్టేడియంలో జరిగిన 6 మ్యాచ్ లకు గాను 6 మ్యాచ్ లలో రెండవ బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది.

మ్యాచ్ వివరాలు:

స్కాట్లాండ్ - న్యూజిలాండ్

నవంబర్ 3 (బుధవారం) 2021

మధ్యాహ్నం 3.30 నిమిషాలు

దుబాయ్ క్రికెట్ స్టేడియం, దుబాయ్

హెడ్ టూ హెడ్:

స్కాట్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటివరకు 2009 లో ఐసిసి ప్రపంచకప్ టీ20 మ్యాచ్ లో తలపడగా ఆ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

తుది జట్టు వివరాలు ఇలా ఉండే అవకాశాలు ఉన్నాయి..

స్కాట్లాండ్ జట్టు:

కైల్ కోయెట్జర్ (c), జార్జ్ మున్సే, మాథ్యూ క్రాస్ (w), కాలమ్ మాక్లియోడ్, రిచీ బెరింగ్టన్, మైకేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ డేవీ, సఫ్యాన్ షరీఫ్, బ్రాడ్లీ వీల్

న్యూజిలాండ్ జట్టు:

మార్టిన్ గప్టిల్, డారిల్ మిచెల్, కేన్ విలియమ్సన్(c), జేమ్స్ నీషమ్, డెవాన్ కాన్వే(w), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌతీ, ఆడమ్ మిల్నే, ట్రెంట్ బౌల్ట్

Show Full Article
Print Article
Next Story
More Stories