T20 World Cup 2021 - Eng Vs SL: నేడు ఇంగ్లాండ్ - శ్రీలంక మధ్య టఫ్ ఫైట్

T20 World Cup 2021 England Vs Sri Lanka Match Preview Today 1st November 2021 - Cricket News
x

T20 World Cup 2021 - England Vs Sri Lanka: నేడు ఇంగ్లాండ్ - శ్రీలంక మధ్య టఫ్ ఫైట్

Highlights

England Vs Sri Lanka: షార్జా వేదికగా టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా నవంబర్ 1 సోమవారం రోజున ఇంగ్లాండ్ - శ్రీలంక మధ్య హోరాహోరి పోరు జరగనుంది. ఇప్పటికే...

England Vs Sri Lanka: షార్జా వేదికగా టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా నవంబర్ 1 సోమవారం రోజున ఇంగ్లాండ్ - శ్రీలంక మధ్య హోరాహోరి పోరు జరగనుంది. ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలతో గ్రూప్ 1 లో ఆరు పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా శ్రీలంక జట్టు మాత్రం ఆడిన మూడు మ్యాచ్ లలో కేవలం ఒకే మ్యాచ్ లో గెలుపొంది సెమీస్ కి వెళ్ళే అవకాశాన్ని మరింత క్లిష్టం చేసుకుంది.ఇంగ్లాండ్ జట్టులో జాసన్ రాయ్ తో పాటు జాస్ బట్లర్ బ్యాటింగ్ తోను, ఆదిల్ రషిద్, టైమల్ మిల్స్ బౌలింగ్ లోను.. లివింగ్ స్టన్, మొయిన్ అలీ అల్ రౌండర్ గా అద్భుత ప్రదర్శన కనబరిచి ఇంగ్లాండ్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

మరోపక్క శ్రీలంక జట్టులో ఆటగాడు చరిత్ అసలంక మూడవ స్థానంలో 142 స్ట్రైక్ రేట్‌తో సగటు 47తో గత మూడు మ్యాచ్ లలో బ్యాటింగ్ లో తన దూకుడు ప్రదర్శించాడు. భానుక రాజపక్సే మరియు వానిందు హసరంగా మిడిల్ ఆర్డర్ తమ వంతు బ్యాటింగ్ తో మంచి పరుగులను సాధిస్తున్నారు. బ్యాటింగ్ లో ఎలాంటి సమస్య లేని శ్రీలంక బౌలింగ్ లో ఎంతవరకు రాణించి ఈరోజు జరగబోయే మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై విజయం సాధిస్తుందో చూడాలి.

మ్యాచ్ వివరాలు:

ఇంగ్లాండ్ vs శ్రీలంక

నవంబర్ 1 (సోమవారం)2021

మధ్యాహ్నం 7.30 నిమిషాలకు

షార్జా క్రికెట్ స్టేడియం, షార్జా

హెడ్ టూ హెడ్:

ఇప్పటివరకు ఇంగ్లాండ్ - శ్రీలంక 12 మ్యాచులలో తలపడగా ఇంగ్లాండ్ 8 మ్యాచ్ లలో, శ్రీలంక 4 మ్యాచ్ లలో గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్ లో నాలుగు సార్లు పోటీపడగా మూడు సార్లు ఇంగ్లాండ్ విజయం సాధించింది.

ఇంగ్లాండ్ జట్టు:

జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (సి), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్

శ్రీలంక జట్టు:

కుసల్ పెరెరా, పేతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో / ధనంజయ డిసిల్వా, భానుక రాజపక్సే, వనిందు హసరంగా, దసున్ షనక (సి), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, లహిరు కుమార

Show Full Article
Print Article
Next Story
More Stories