T20 World Cup 2021 - Afghan Vs Namibia: నేడు ఆఫ్ఘానిస్తాన్ తో నమీబియా ఢీ

T20 World Cup 2021 Afghanistan Vs Namibia Match Preview Today 31st October 2021 - Cricket News
x

T20 World Cup 2021 - Afghanistan Vs Namibia: నేడు ఆఫ్ఘానిస్తాన్ తో నమీబియా ఢీ

Highlights

T20 World Cup 2021 - Afghanistan Vs Namibia: ఆఫ్ఘానిస్తాన్, నమీబియా మధ్య నేడు అక్టోబర్ 31 ఆదివారం రోజున మధ్యాహ్నం 3.30 నిమిషాలకు అబుధాభి వేదికగా షేక్...

T20 World Cup 2021 - Afghanistan Vs Namibia: ఆఫ్ఘానిస్తాన్, నమీబియా మధ్య నేడు అక్టోబర్ 31 ఆదివారం రోజున మధ్యాహ్నం 3.30 నిమిషాలకు అబుధాభి వేదికగా షేక్ జాయద్ స్టేడియంలో హోరాహోరి పోరు జరగనుంది. ఇప్పటికే గ్రూప్ 2 లో నమీబియా జట్టు స్కాట్లాండ్ తో ఆడిన మ్యాచ్ లో విజయం సాధించగా, ఆఫ్ఘనిస్తాన్ స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించిన, పాకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది.

తాజాగా ఆఫ్ఘానిస్తాన్, నమీబియా జట్లలో టాస్ గెలిచిన జట్టు అబుదాబిలో ఛేజింగ్ చేసేందుకే ఆసక్తి చూపే అవకాశాలున్నాయి. ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్ లో అబుదాబి పిచ్‌పై జరిగిన 7 మ్యాచుల్లో ఛేజింగ్ చేసిన జట్టు 6 సార్లు గెలుపొందింది. ఇక ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండటంతో ముజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్ లాంటి స్పిన్నర్లకు కలిసొచ్చే అవకాశం ఉంది.

మ్యాచ్ వివరాలు:

ఆఫ్ఘానిస్తాన్ vs నమీబియా

అక్టోబర్ 31(ఆదివారం)2021

మధ్యాహ్నం 3.30 నిమిషాలకు

షేక్ జాయద్ స్టేడియం, అబుదాభి

హెడ్ టూ హెడ్:

ఆఫ్ఘానిస్తాన్, నమీబియా ఇరు జట్లు ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో తలపడలేదు. టీ20 ప్రపంచకప్‌ 2021లో ఆదివారం అక్టోబర్ 31న ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి.

ఆఫ్ఘానిస్తాన్ జట్టు:

హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజాద్, రహ్మానుల్లా గుర్బాజ్, నజీబుల్లా జద్రాన్, మొహమ్మద్ నబీ (సి), అస్గర్ ఆఫ్ఘన్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, కరీం జనత్ / ఫరీద్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ముజీబ్ ఉర్ రహ్మాన్.

నమీబియా జట్టు:

క్రెయిగ్ విలియమ్స్, జేన్ గ్రీన్, గెర్హార్డ్ ఎరాస్మస్ (సి), డేవిడ్ వైస్, మైఖేల్ వాన్ లింగెన్, JJ స్మిత్, జాన్ ఫ్రైలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్

Show Full Article
Print Article
Next Story
More Stories