ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్

T20 Match Between India and Australia Today
x

ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య టీ20 మ్యాచ్ 

Highlights

India vs Australia: రా. 7.30కి మొహాలి వేదికగా మ్యాచ్

India vs Australia: సొంత గడ్డపై టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. మూడు టీ 20 మ్యా్చ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ మొహలీలో రాత్రి ఏడున్నరకు ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఈ సిరీస్‌ను మెగాటోర్నీకి సన్నాహకంగా భావిస్తుండటంతో హోరాహోరీ తప్పకపోవచ్చు. ఆసియా కప్‌లో టీమ్‌ను ఇబ్బంది పెట్టిన మిడిల్ ఆర్డర్‌ను సరిదిద్దుకోవాల్సి ఉంది. జట్టు కూర్పు విషయంలో స్పష్టతతో ఉన్నామని రోహిత్‌ శర్మ ప్రకటించినా.. అభిమానుల్లో పలు సందేహాలు కొనసాగుతూనే ఉన్నాయి. టాప్‌ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి రానున్నాడు. వికెట్‌ కీపర్‌గా బరిలోకి దిగేది ఎవరనేది నేటి మ్యాచ్‌తో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌ రూపంలో ఇద్దరు స్పెషలిస్ట్‌లు అందుబాటులో ఉండగా.. పంత్‌ అవకాశాలను వినియోగించుకోలేక ఇబ్బంది పడుతున్నాడు. భారత్ , ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 23 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. 13 మ్యాచ్‌ల్లో భారత్, 9 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా గెలిచాయి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఏడు మ్యాచ్‌లు ఆడిన భారత్ నాలుగింటిలో గెలిచి, మూడింటిలో ఓడిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories