Syed Mushtaq Ali Trophy: అజహరుద్దీన్ నువ్వెంతో గ్రేట్- వీరేంద్ర సెహ్వాగ్

వీరేంద్ర సెహ్వాగ్
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కేరళ బ్యాట్స్‌మన్ మహ్మద్ అజహరుద్దీన్ విరోచిత సెంచరీ చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో కేరళ బ్యాట్స్‌మన్ మహ్మద్ అజహరుద్దీన్ విరోచిత సెంచరీ చేశాడు. దీంతో అజహరుద్దీన్ బ్యాటింగ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్ మీడియా టీమ్‌ఇండియా మాజీ ఓపెనర్, బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ పలు అంశాలపై స్పందిస్తుంటాడు. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా స్నీడ్నీ టెస్టులో భారత క్రికెటర్లను అభినందించడమే కాకుండా స్మీత్ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు టీమిండియాలో తిరిగి ఆడతానని, ఆస్ట్రేలియాలో నాలుగో టెస్టుకు సిద్ధం అంటూ చమత్కరించాడు.
ఈ నేపథ్యంలోనే వీరేంద్ర సెహ్వాగ్ కేరళ బ్యాట్స్‌మన్ మహ్మద్ అజహరుద్దీన్ బ్యాటింగ్ శైలిని కొనియాడారు. ముంబయి లాంటి గొప్ప జట్టుపై ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం సాధారణ విషయం కాదన్నాడు. ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించాడని మెచ్చుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ చూసి సంతోషించానని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మొహమ్మద్ అజహరుద్దీన్ (54 బంతుల్లో 137 నాటౌట్; 9 ఫోర్లు, 11 సిక్సర్లు) మెరుపు ప్రదర్శనతో కేరళ జట్టు 8 వికెట్లతో ఘన విజయం సాధించింది. ముంబై 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 196 పరుగులు చేయగా... అజహరుద్దీన్ విద్వంసక ఇన్నింగ్స్ తో కేరళ 15.5 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది.
ముస్తాక్ అలీ టి20 టోర్నీలో మరో మ్యాచ్ లో మేఘాలయ కెప్టెన్ పునీత్ బిష్త్ మిజోరాంతో జరిగిన మ్యాచ్‌లో 51 బంతుల్లోనే 6 ఫోర్లు, 17 సిక్సర్లతో 146 పరుగులు చేసి టి20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా ఘనత వహించాడు. మేఘాలయ 230 పరుగులు సాధించగా, మిజోరాం 100 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి 130 పరుగుల తేడాతో చిత్తయింది. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్‌గా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. శ్రేయస్ 15 సిక్సర్లు కొట్టాడు. ఓవరాల్‌గా ఎక్కువ సిక్సర్లు కొట్టిన రికార్డు వెస్టిండీస్ విద్వంసక ఆటగాడు క్రిస్ గేల్ (18) పేరిట ఉంది.
Wah Azharudeen , behtareen !
— Virender Sehwag (@virendersehwag) January 13, 2021
To score like that against Mumbai was some effort. 137* of 54 and finishing the job on hand. Enjoyed this innings.#SyedMushtaqAliT20 pic.twitter.com/VrQk5v8PPB