Suryakumar Yadav: 'కింగ్' కోహ్లీ రెకార్డుపై కన్నేసిన సూర్య భాయ్.. టీ20 వరల్డ్‌కప్‌ 2026 టార్గెట్!

Suryakumar Yadav: భారత టీ20 క్రికెట్ చరిత్రలో కెప్టెన్సీ ఒక ప్రత్యేక అధ్యాయం. కాలానుగుణంగా మారిన ఫార్మాట్లు, కొత్త తరహా ఆటగాళ్లు, దూకుడు ఆటతీరు మధ్య భారత జట్టును నడిపించిన కెప్టెన్ల పాత్ర ఎంతో కీలకం.

Rishvik
Published on: 2 Feb 2026 12:45 PM IST
Suryakumar Yadav: కింగ్ కోహ్లీ రెకార్డుపై కన్నేసిన సూర్య భాయ్.. టీ20 వరల్డ్‌కప్‌ 2026 టార్గెట్!
X

Suryakumar Yadav: 'కింగ్' కోహ్లీ రెకార్డుపై కన్నేసిన సూర్య భాయ్.. టీ20 వరల్డ్‌కప్‌ 2026 టార్గెట్!

Suryakumar Yadav: భారత టీ20 క్రికెట్ చరిత్రలో కెప్టెన్సీ ఒక ప్రత్యేక అధ్యాయం. కాలానుగుణంగా మారిన ఫార్మాట్లు, కొత్త తరహా ఆటగాళ్లు, దూకుడు ఆటతీరు మధ్య భారత జట్టును నడిపించిన కెప్టెన్ల పాత్ర ఎంతో కీలకం. ఈ క్రమంలో టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టుకు అత్యధిక మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన కెప్టెన్ల జాబితా ఆసక్తికరంగా మారింది. ఈ జాబితాలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అగ్ర స్థానంలో ఉన్నాడు. ధోనీ భారత్ తరఫున మొత్తం 72 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి తనదైన ముద్ర వేశాడు. ప్రశాంతమైన స్వభావం, వ్యూహాత్మక నిర్ణయాలతో టీ20 ఫార్మాట్‌లో భారత్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టాడు.

ఈ జాబితాలో సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 62 మ్యాచ్‌లలో టీమిండియాకు నాయకత్వం వహించి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. మూడో స్థానంలో కింగ్ విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లీ 50 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి.. దూకుడు ఆటతీరు, అగ్రెసివ్ నాయకత్వంతో అభిమానులను ఆకట్టుకున్నాడు. నాలుగో స్థానంలో ప్రస్తుత భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఇప్పటివరకు 43 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్య.. త్వరలోనే కోహ్లీ రికార్డును అధిగమించడానికి సిద్ధంగా ఉన్నాడు.

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు. గ్రూప్ దశలో టీమిండియా నాలుగు మ్యాచులు ఆడుతుంది. సూపర్ 8లో రెండు, సెమీస్లో 1 మ్యాచ్ ఆడనుంది. భారత్ కచ్చితంగా సెమీస్ చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. దాంతో విరాట్ కోహ్లీని దాటడం దాదాపు ఖాయం అని క్రికెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఐదో స్థానంలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. హార్దిక్ ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లకు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు కొత్త దిశలో ప్రయాణిస్తోంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం, దూకుడు ఆటను ప్రోత్సహించడం, టీమ్ స్పిరిట్‌ను పెంపొందించడం వంటి అంశాల్లో సూర్య నాయకత్వంలో ప్రత్యేకంగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌ 2026లో సూర్య సారథ్యంలో భారత్ ప్రదర్శనపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కోహ్లీ, ధోనీ, రోహిత్‌ల సరసన సూర్యకుమార్ తన పేరును నిలబెట్టుకుంటాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. టీమిండియా అభిమానులు మాత్రం కెప్టెన్ సూర్య సారథ్యంలో ఈ వరల్డ్‌కప్‌లో భారత్ ట్రోఫీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Rishvik

Rishvik

Next Story