Suryakumar-Tilak Varma: ముంబై ఫ్రాంచైజీ పరువు పొగొట్టుకుంది.. తిలక్‌ వర్మ రిటైర్డ్‌ హర్ట్‌-అవుట్‌ నిర్ణయం సూర్యభాయ్‌కు కూడా కోపం తెప్పించింది!

Suryakumar-Tilak Varma
x

Suryakumar-Tilak Varma: ముంబై ఫ్రాంచైజీ పరువు పొగొట్టుకుంది.. తిలక్‌ వర్మ రిటైర్డ్‌ హర్ట్‌-అవుట్‌ నిర్ణయం సూర్యభాయ్‌కు కూడా కోపం తెప్పించింది!

Highlights

Suryakumar-Tilak Varma: ఓ క్రికెటర్‌ను ఇంతలా ఇన్‌సల్ట్‌ చేయడం చాలా ఘోరమైన విషయం..!

Suryakumar-Tilak Varma: ముంబై ఇండియన్స్ మళ్లీ ఓ వివాదాస్పద నిర్ణయంతో వార్తల్లోకెక్కింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం నుంచి కేవలం 12 పరుగుల దూరంలో నిలిచిన ముంబై జట్టు చివరి ఓవర్‌కు ముందు కీలకంగా నిలిచిన నిర్ణయంతో అభిమానులనే కాదు, టీమ్ ప్లేయర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ గెలవాలంటే ఇంకా 24 పరుగులు అవసరమైన సమయంలో, ఫామ్‌లో ఉన్న బ్యాటర్ తిలక్ వర్మను రిటైర్‌ అవుట్‌ చేసిన ముంబై.. ఆయన స్థానంలో మిచెల్ శాంట్నర్‌ను క్రీజులోకి పంపింది.

తిలక్ వర్మ అప్పటికే 25 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. కానీ ఆ సమయంలో బౌండరీలు తక్కువగా వచ్చాయి, స్కోరింగ్ రేట్ పెంచాల్సిన అవసరం ఉంది. దాంతో తిలక్‌ను స్వచ్ఛందంగా బయటకు పిలిపించి శాంట్నర్‌ను పంపడం అనే నిర్ణయం తీసుకుంది ముంబై టీమ్ మేనేజ్‌మెంట్. అయితే శాంట్నర్ మాత్రం రెండు బంతుల్లో కేవలం రెండు పరుగులకే పరిమితమయ్యాడు. ముంబై మ్యాచ్‌ను కోల్పోయింది.

కానీ ఇది అంతటితో ఆగలేదు. తిలక్ క్రీజ్ వదిలి వస్తుండగా డగౌట్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ భయంకరంగా షాక్‌కు గురయ్యాడు. ఆయన ముఖంలో సందిగ్ధం, అసహనం కనిపించాయి. తిలక్‌ను రిటైర్‌ అవుట్‌ చేయడాన్ని అసలు అర్థం చేసుకోలేకపోయినట్టే కనిపించాడు. కోచ్ జయవర్ధనే వెళ్లి సూర్యకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అతని ఫేస్‌ రియాక్షన్ మాత్రం దానికి ఒప్పుకోలేదని స్పష్టమవుతుంది.

మ్యాచ్ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా దీనికి సమాధానం ఇస్తూ తిలక్ క్రీజులో చాలాసేపు ఉన్నా కూడా బంతులు బౌండరీకి పంపలేకపోయాడని, అలాంటప్పుడు కొత్త ఆప్షన్ ట్రై చేయడం తప్పేమీ కాదని అన్నారు. కానీ ఈ నిర్ణయాన్ని మాజీ క్రికెటర్లు గట్టిగా విమర్శించారు. హర్భజన్, సేహ్వాగ్, ఇర్ఫాన్ పఠాన్ లాంటి వారు సోషల్ మీడియాలో దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. IPL చరిత్రలో తిలక్ వర్మ కేవలం నాల్గవ రిటైర్డ్ అవుట్ ప్లేయర్‌. అటు అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఇదంతా టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకున్న అర్ధంలేని నిర్ణయంగా భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories