
Suryakumar Yadav: రత్ తరఫున టీ20ల్లో అత్యధిక POTM అవార్డులు అందుకున్న ఆటగాడిగా సూర్యకుమార్ అగ్రస్థానంలో నిలిచాడు.
Suryakumar Yadav: అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు ఆటగాళ్ల ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తాయి. ఒత్తిడిలోనూ మ్యాచ్ దిశను మార్చే ప్రదర్శనలు చేసిన వారికే ఈ అవార్డు దక్కుతుంది. తాజాగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా అమెరికాపై వీరోచిత ఇనింగ్స్ (84; 49 బంతుల్లో 10×4, 4×6) ఆడిన సూర్య ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు. దాంతో భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక POTM అవార్డులు అందుకున్న ఆటగాడిగా సూర్యకుమార్ అగ్రస్థానంలో నిలిచాడు.
సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 105 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 17 సార్లు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. వినూత్న షాట్లు, 360 డిగ్రీ బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను క్షణాల్లో మలుపు తిప్పేయగల సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలబెట్టింది. మధ్య ఓవర్లలో వేగంగా రన్స్ సాధించడం, డెత్ ఓవర్లలో ధాటిగా ఆడటంతో కీలక మ్యాచ్‌ల్లో సూర్య ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ జాబితాలో రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. 125 మ్యాచ్‌ల్లో 16 POTM అవార్డులు సాధించిన కోహ్లీ.. స్థిరమైన బ్యాటింగ్, చేజ్ల్లో చూపిన అసాధారణ నైపుణ్యంతో భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో, ఒత్తిడి పరిస్థితుల్లో కోహ్లీ చేసిన ఇన్నింగ్స్‌లు అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేవే.
మూడో స్థానంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నిలిచాడు. 159 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 14 POTM అవార్డులు అందుకున్నాడు. ఓపెనర్‌గా వేగవంతమైన ఆరంభాలు ఇచ్చి జట్టుకు రోహిత్ మద్దతుగా నిలిచాడు. భారీ షాట్లు, మ్యాచ్ విన్నింగ్ నాక్స్‌తో టీ20 ఫార్మాట్లో తనదైన ముద్ర వేశాడు. ఈ జాబితాలో మరో ఆసక్తికరమైన పేరు అక్షర్ పటేల్. 88 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 8 POTM అవార్డులు సాధించిన అక్షర్.. ఆల్‌రౌండర్‌గా సత్తాచాటాడు. కీలక ఓవర్లలో వికెట్లు, అవసరమైనప్పుడు వేగంగా రన్స్ చేయడం ద్వారా అక్షర్ మంచి ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.
భారత్ టీ20ల్లో అత్యధిక POTM అవార్డులు:
# 17 సూర్యకుమార్ యాదవ్ (105 టీ20లు)
# 16 విరాట్ కోహ్లీ (125 టీ20లు)
# 14 రోహిత్ శర్మ (159 టీ20లు)
# 8 అక్షర్ పటేల్ (88 టీ20లు)

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




