SKY Records: ఫస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా సూర్య కుమార్ యాదవ్ రికార్డ్

SKY Records:  ఫస్ట్ ఇండియన్ బ్యాటర్‌గా సూర్య కుమార్ యాదవ్ రికార్డ్
x
Highlights

Surya Kumar Yadav's records: ఇలా తక్కువ బంతుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్య కుమార్ యాదవ్

MI vs LSG Match: ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపిఎల్ టోర్నీల్లో తక్కువ బంతుల్లో 4000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ బ్యాటర్ గా సూర్య కుమార్ యాదవ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆదివారం వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా సూర్య కుమార్ ఈ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ ఈ రికార్డ్ సృష్టించడానికి 2705 బంతులు అవసరమయ్యాయి. 147.87 స్ట్రైక్ రేటుతో సూర్య ఈ రికార్డ్ పూర్తి చేశాడు.

ఇలా తక్కువ బంతుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో సూర్య కుమార్ ప్రస్తుతం 3వ స్థానంలో ఉన్నాడు. సూర్య కంటే ముందున్న వారిలో మొదటి స్థానంలో లెజెండరీ క్రికెటర్ క్రిస్ గేల్ కాగా రెండో స్థానంలో లెజెండ్ ఏబి డివిలియర్స్ ఉన్నారు.

క్రిస్ గేల్ బంతుల్లో ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక ఏబి డివిలియర్స్ విషయానికొస్తే... బంతుల్లో ఆయన ఈ రికార్డ్ సాధించాడు. ఈ ఇద్దరి తరువాత మళ్లీ ఆ రికార్డ్ సొంతం చేసుకున్న ఇండియన్ బ్యాటర్ మాత్రం సూర్య కుమార్ యాదవ్ కావడం విశేషం.

తనదైన స్టైల్లో స్టేడియం నలువైపులా 360 డిగ్రీల్లో షాట్స్ కొట్టే క్రికెటర్‌గా సూర్య కుమార్ యాదవ్‌కు పేరుంది. ఇప్పటివరకు ఐపిఎల్ 2 సెంచరీలు పూర్తి చేసిన యాదవ్ పేరిట మొత్తం 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories