RR vs SRH: హైదరాబాద్ లక్ష్యం 221; సెంచరీతో(124) దుమ్మురేపిన బట్లర్

RR vs SRH: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపారు. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేశారు.

Venkata Chari
Published on: 2 May 2021 5:33 PM IST
Sunrisers Hyderabad Target is 221 in 20 Overs
X

దుమ్మురేపిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్స్

RR vs SRH: టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపారు. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేశారు. జాస్ బట్లర్ సెంచరీతో (124 పరుగులు, 64 బంతులు, 11ఫోర్లు, 8 సిక్సులు) కదం తొక్కి హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోశాడు. దీంతో హైదరాబాద్ టార్గెట్ 221 పరుగులుగా నిర్దేశించింది.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపాడు.

మరో ఓపెనర్ జైశ్వాల్ 12 పరుగల వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. అలాగే సంజూ శామ్సన్ (48 పరుగులు, 33 బంతులు, 4ఫోర్లు, 2 సిక్సులు) మరోసారి అద్భుతంగా ఆడాడు. ఇక మూడో వికెట్ గా జాస్ బట్లర్ వెనుదిరిగాడు. దీంతో 20 ఓవర్లకు 220 పరుగులు చేశారు.

Venkata Chari

Venkata Chari

Next Story