IPL 2021: హైదరాబాద్ లక్ష్యం 188; హాఫ్ సెంచరీలతో రాణించిన కేకేఆర్ బ్యాట్స్‌మెన్స్ రానా, త్రిపాఠి

Sunrisers Hyderabad ‍Need 187 in 20 Overs
x
కేకేఆర్ బ్యాట్స్‌మెన్ నితిష్ రానా (ఫొటో ట్విట్టర్)
Highlights

IPL 2021: నేడు జరుగుతున్న మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది.

IPL 2021: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు జరుగుతున్న మూడో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీం ముందు భారీ లక్ష్యం ఉంది. చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

బ్యాటింగ్ ప్రారంభించిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, నితిష్ రానా ఆచితూచి ఆడారు. ఇద్దరు కలిసి 7 ఓవర్లకు 53 పరుగులు చేసి మంచి ఊపు మీదున్నట్లు కనిపించారు. కానీ, అదే ఓవర్లో రషీద్ ఖాన్ వేసిన ఆఖరి బంతికి శుభ్ మన్ గిల్ 15 పరుగులు(13 బంతులు, 1 ఫోర్, 1 సిక్స్) చేసి బౌల్డ్ అయ్యాడు.


అనంతరం బ్యాటింగ్ వచ్చిన రాహుల్ త్రిపాఠితో కలిసి నితిష్ రానా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ ధాటిగా ఆడి తమ హాఫ్ సెంచరీలు పూర్తిచేశారు. ఈ క్రమంలో రాహుల్ త్రిపాఠి (53 పరుగులు, 29 బంతులు, 5 ఫోర్లు, 2 ఫోర్లు) 15.2 ఓవర్లో నటరాజన్ బౌలింగ్ లో కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


నాలుగో స్ఠానంలో బ్యాటింగ్ వచ్చిన ఆండ్రీ రస్సెల్ పై టీం చాలా ఆశలు పెట్టుకుంది. కానీ, అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. కేవలం 5 బంతులు(5 పరుగులు, 1 ఫోర్) ఆడి రషీధ్ ఖాన్ బౌలింగ్ పెవిలియన్ చేరాడు.18 ఓవర్లో నబీ బౌలింగ్ తో కేకేఆర్ టీం ను భయపెట్టాడు. వరస బంతుల్లో సెంచరీ దిశగా సాగుతున్న నితిష్ రానా (80 పరుగులు, 56 బంతులు, 9 ఫోర్లు, 4 సిక్సులు)ను, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(2 పరుగులు) ను ఔట్ చేసి దెబ్బతీశాడు.


అనంతంర బ్యాటింగ్ వచ్చిన కీపర్ దినేష్ కార్తిక్ కేవలం 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో 22 పరుగులు చేశాడు. దీంతో కేకేఆర్ టీం 20 ఓవర్లకు 187 పరుగులు చేసింది.

ఇక సన్ రైజర్స్ బౌలర్లలో రషీధ్ ఖాన్, నబీ చెరో రెండు వికెట్లు, నటరాజన్, భూవీ చెరో వికెట్ తీశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories