ధోని భవితవ్యంపై సునీల్‌ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు

ధోని భవితవ్యంపై సునీల్‌ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
x
Highlights

భారతజట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని పునరాగమనంపై మరో సారి చర్చ మొదలైంది. 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత ధోని తిరిగి టీమిండియా తరపున ఆడలేదు.

భారతజట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోని పునరాగమనంపై మరో సారి చర్చ మొదలైంది. 2019 వన్డే ప్రపంచ కప్ తర్వాత ధోని తిరిగి టీమిండియా తరపున ఆడలేదు. అయితే తాజాగా దీనిపై సునీల్‌ గవాస్కర్‌ స్పందించారు. ధోని విశ్రాంతి తీసుకోవడంపై ఫైర్ అవుతున్నారు. ఇంత సుదీర్ఘ కాలం ఏ ఆటగాడైనా జాతీయ జట్టుకు దూరంగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

ధోని విశ్రాంతి తీసుకోవడంపై సునీల్‌ గవాస్కర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.. వచ్చే టీ20 ప్రపంచ కప్ లో ధోని ఉండానుకుంటే అతడి ఫిట్‌నెస్‌ గురించి ఎవరేం చర్చించాల్సిన అవరసం ఉందన్నారు. ‎ ఈ విషయమై ధోని తనకు తాను ప్రశ్నించుకోవాలని చెప్పారు. 2019లో వన్డే ప్రపంచకప్ నుంచి ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఇంతకాలం ఏ క్రికెటర్ అయినా జాతీయ జట్టుకు దూరమయ్యారా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న తన ఒక్కడిదే కాదని అందరి మదిలో ఉందని గవాస్కర్‌ అన్నారు. అయితే గతంలో దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా స్పందించారు. ఈ విషయం ధోనినే అడగాలని తేల్చి చెప్పారు.

ధోని తన పునరాగమనంపై జనవరి వరుకు ఎవరు ప్రశ్నించ వద్దని కోరారు. జనవరిలో తాను పూర్తి వివరాలు వెల్లడిస్తానన్నారు.

రంజీ ట్రోఫిపై ఐపీఎల్ ప్రభావం ఎక్కువగా ఉంది. సుదీర్ఘ చరిత్ర గల దేశవాళీ టోర్నీలో ఆడే క్రికెటర్ల ఫీజు విషయమై చాలా ప్రభావం చూపుతుందని అన్నారు.

దేశవాళీ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు రూ. 2.5 లక్షలు ఫీజు ఉంటుందని, అది చాలా తక్కువన్నారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లతో పోల్చుకుంటే చాలా తక్కువ. కాగా, దేశవాళీ మ్యాచ్ ఫీజులు పెంచాలని లేకుంటే మాసకబరుతుందని అభ్రిప్రాయపడ్డారు. దేశంలో నెలకొన్న సంక్షోభమేపై గావస్కర్‌ స్పందించారు. గతంలో సంక్షోభమే వస్తే సమర్థంగా ఎదుర్కొన్నాం అని తెలిపారు.

కాగా.. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సునీల్ గవాస్కర్ స్పందిస్తూ.. క్లాస్ రూమ్లో ఉండాల్సిన విద్యార్థులు రోడ్డులపై కనిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు గాయాలపాలై ఆస్పత్రిలో చేరాల్సిన సందర్భం వచ్చిందన్నారు. అందరం ఒక్కటిగా దేశాన్ని మహోన్నత స్థాయికి తీసుకెళ్లగలమని అన్నారు. క్రీడాలు మాకు ఇదే నేర్పిందని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories