గంగూలీకి అద్భుతమైన సలహా ఇచ్చిన సునిల్‌ గవాస్కర్‌

గంగూలీకి అద్భుతమైన సలహా ఇచ్చిన సునిల్‌ గవాస్కర్‌
x
Sunil Gavaskar, Sourav Ganguly File Photo
Highlights

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి ఉమెన్స్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించాలని టీమిండియా దిగ్గజ క్రికెటర్ గవాస్కర్‌ సలహా ఇచ్చారు. మహిళల...

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీకి ఉమెన్స్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించాలని టీమిండియా దిగ్గజ క్రికెటర్ గవాస్కర్‌ సలహా ఇచ్చారు. మహిళల క్రికెట్‌ మరింత ఉన్నత స్థాయికి చేరాలంటే ఇలాంటి సిరీస్ నిర్వహించాలని సూచించారు. భారత మహిళల క్రికెట్ జట్టు మెరుగవ్వడానికి బీసీసీఐ తోడ్పాటు చాలా ఉందని అన్నారు.

తాజాగా సునిల్‌ గవాస్కర్‌ మాట్లాడుతూ... 'ఉమెన్స్‌ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌'ను నిర్వహించాలన్సిన అవశక్యత ఉందని అన్నారు. ఎనిమిది జట్లు లేకపోయినా, కొన్ని జట్లతో అయినా ఐపీఎల్‌ నిర్వహిస్తే ఎంతో మేలు జరుగుతుందన్నారు. టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాపై భారత్ ఓడిన తర్వాత సునిల్ గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా అమ్మాయిలను ఆస్ట్రేలియాలో ముక్కోణపు సిరీస్‌ ఆడించింది. దీంతో హర్మన్‌సేనకు పిచ్‌, అక్కడి అలవాటు పడడానికి అవకాశం లభించింది. ఇది గొప్ప నిర్ణయం. మహిళల క్రికెటర్ల కోసం బీసీసీఐ మరో అడుగు వేయాలన్నారు.

మెన్స్ జట్టులో ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్‌లో రాణించి జాతీయ జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా మహిళా జట్టు పటిష్ఠంగా నిలవడానికి ఆదేశ క్రికెట్ బోర్డు ఎంతో కృషి ఉంది. అక్కడి క్రికెటర్లుకు 'ఉమెన్స్‌ బిగ్‌ బాష్ లీగ్‌' నిర్వహించింది. టీమిండియా ప్లేయర్లు స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఉమెన్స్‌ బీబీఎల్‌ ఆడారని గుర్తు చేశారు. ప్రస్తుత భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతంగా ఉంది. వారితో ఎక్కువ క్రికెట్‌ ఆడిస్తే ఎంతో మెరుగువుతారు. జట్టులో చాలా మంది యువ క్రీడాకారిణులే ఉన్నారని గవాస్కర్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories